శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,235/10g+1.53%
భాషలు

తాజా వార్తలు

కలిసిమెలిసి పండుగ జరుపుకోవాలి-చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ

nagendra17 September 2026, 11:29 PM0 చూసులుtrinetnews.com
కలిసిమెలిసి పండుగ జరుపుకోవాలి-చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

22వ సంవత్సరం వినాయక ఉత్సవాలు ఘనంగా

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 17:

టీం యువ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 22వ సంవత్సరం వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని చిలకలగూడ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ ముఖ్య అతిథిగా సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ, వినాయక చవితి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో కలిసిమెలిసి జరుపుకోవాలని సూచించారు. ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మండప నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్రమశిక్షణతో ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు.

వినాయక మండపాల నిర్వహణకు, శాంతిభద్రతల పరిరక్షణకు చిలకలగూడ పోలీసుల పూర్తి సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టీం యువ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్, సభ్యులు బాలు, రవికాంత్, దుర్గ, చండు, శరత్, శ్రీధర్ రెడ్డి, సన్నీ, సాయి, తేజ, శన్ముఖ్, శ్రీకర్, వెడ్కంత్, అశ్విన్, యజ్ఞదత్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

రైల్వే డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

రైల్వే డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

రైల్వే డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. హైద్రాబాద్, ట్రైనెట్, న్యూస్, అక్టోబర్,9.పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహభరితంగా నిర్వహించారు.తార్నాక లోని రైల్వే డిగ్రీ కళాశాలలో 1985 బ్యాచ్ తెలుగు మీడియం విద్యా

మిగతా చదవండి →

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు రవీంద్రభారతిలో ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం అక్టోబరు 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ హైదరాబాద్‌, అక్టోబరు 9 (ట్రైనెట్ న్యూస్): తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘

మిగతా చదవండి →

మహిళా సాధికారతకు ప్రతీకగా సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో 46వ స్నాతకోత్సవం

మహిళా సాధికారతకు ప్రతీకగా సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో 46వ స్నాతకోత్సవం

మహిళా సాధికారతకు ప్రతీకగా సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో 46వ స్నాతకోత్సవం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 9, 2026: హైదరాబాద్‌లోని బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో 46వ స్నాతకోత్సవం ఘనంగా నిర్

మిగతా చదవండి →

యువతలో మంచి చేయాలనే ఆలోచనలు రావాలి: డాక్టర్ కేవీ రమణాచారి

యువతలో మంచి చేయాలనే ఆలోచనలు రావాలి: డాక్టర్ కేవీ రమణాచారి

యువతలో మంచి చేయాలనే ఆలోచనలు రావాలి డాక్టర్ కేవీ రమణాచారి హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 9 : నేటి యువతలో మంచి చేయాలనే ఆలోచనలు ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణ చారి అన్నారు. బ్రాహ్మణ

మిగతా చదవండి →