అమరావతి సెప్టెంబర్ 5 ట్రైనెట్ (ఏపీ )
ఆంద్ర ప్రదేశ్ లో శాంతి భద్రత లు మరింత బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక కమిషనరేట్ ను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా కొన్ని అతిముఖ్యమైన కార్పొరేషన్ పరిధిలో ఈ కమిషనరేట్ రానున్నాయి.
వాటిలో ప్రధానంగా రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
ఇవి ఆమోదం పొందితే విజయవాడ, విశాఖతో కలిపి 6 కమిషనరేట్లు అవుతాయి. దీనివల్ల సైబర్ క్రైమ్ కట్టడి, సీసీ కెమెరాల నెట్వర్క్, ట్రాఫిక్ శాంతిభద్రతల విభాగాల మధ్య సమన్వయం మెరుగుపడుతుందని, ప్రజలకు మెరుగైన భద్రత అందుతుందని అధికారులు భావిస్తున్నారు.
ట్రై నెట్ రాజా పెంట పాటి అమరావతి ఏ పి





