Chief Editor: Rapolu Venkatehwarlu

Change edition

Tuesday25 August 2026

HyderabadSunrise 6:01 amSunset 6:35 pm

Tuesday

25 August 2026

Hyderabad

Sunrise 6:01 am

Sunset 6:35 pm

SENSEX77,656+0.97%
NIFTY24,335+1.06%
HYD 22K₹1,53,231/10g+3.58%
HYD 24K₹1,67,161/10g+3.58%
SILVER₹2,24,745/kg-0.27%

Latest News

మల్లెల పరిమళం ( కవిత)- రచన తంగెళ్లపల్లి కనకాచారి

nagendra24 August 2026, 6:51 AM10 viewstrinetnews.com
మల్లెల పరిమళం ( కవిత)- రచన తంగెళ్లపల్లి కనకాచారి

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్

వీధి అంతా మల్లెల పరిమళమే.. అవును మల్లెలమ్ముతూ పూల వాడు అటు వెళ్ళాడు!

నిజం మంచి మనసు ముందు మన బతుకు పరిమళమే!

తేటతెల్లమైన మన అస్తిత్వాలు నిసిగ్గుగా అహంతో రంకెలు వేస్తాయి వేల నాటకాలలో తమని తాము దాచుకుంటాయి

కొండల్లో నుండి పారుతూ స్వచ్ఛమైన జలంలా ఓ నవ్వు మనల్ని తాకినప్పుడు

మన వేషాలు నగ్నత బట్టబయలౌతుంది

ఎవ్వరూ మొరపెట్టుకోకండి .. మనుషులు మారుతారని భ్రమించకండి...

మీ తోవన పోతూ

అందరికీ అభివాదం చేస్తూ నమస్కరిస్తూ పొండి!

నిజం చెప్తున్నాను ఘర్షణలు కేవలం అపోహలే!

ఎవరికి మీ నిజాయితీని

స్నేహాన్ని వివరించకండి!

మల్లెల పరిమళమై సాగిపోండి!!

O

Also read