హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 4:
శ్రీపోతన భాగవత సప్తాహం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా “సతులారా చూడరే శ్రావణ బహుళాష్టమి” పేరుతో భక్తి సంగీత విభావరి త్యాగరాయ గానసభలోని కళా వెంకట దీక్షితులు కళా వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంగరాజు లక్ష్మి ఆధ్వర్యంలో ప్రముఖ గాయనీ గాయకులు ఆలపించిన భక్తి గీతాలు అలరించాయి.





