హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 6:
నగరంలోని రోడ్ల పక్కన, ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో ఆదరణకు నోచుకోని వారికి అండగా నిలిచేందుకు ప్రతి ఆదివారం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా దుస్తులు అందుకున్న వారు సంతోషం వ్యక్తం చేస్తూ స్కై ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు వై. సంజీవ కుమార్, ఉపాధ్యక్షురాలు ఓ. పావని పాల్గొన్నారు.





