ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

శుక్రవారం18 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:15 pm

శుక్రవారం

18 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:15 pm

SENSEX74,315-0.62%
NIFTY23,271-0.54%
హైదరాబాద్ 22K₹1,44,875/10g+1.08%
హైదరాబాద్ 24K₹1,58,045/10g+1.08%
వెండి₹2,20,919/kg+4.44%

తాజా వార్తలు

జీహెచ్ఎంసీలో తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ప్రధాన కార్యాలయంలో తాగు నీటి కటకట

nagendra17 September 2026, 11:24 PM0 చూసులుtrinetnews.com
జీహెచ్ఎంసీలో తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ప్రధాన కార్యాలయంలో తాగు నీటి కటకట

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 17:

మూడు ముక్కలైన జీహెచ్ఎంసీలో రోజుకో కుంభకోణం, పూటకో అక్రమం బయటపడుతూ, ఖజానాలోని నిధులు అక్రమార్కుల జేబుల్లోకి చేరుతున్నా పట్టించుకోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులు కనీసం తమ కోసం, తమ కింది స్థాయి సిబ్బంది కోసం స్వచ్ఛమైన తాగు నీటిని అందుబాటులోకి తీసుకురావాలన్నవిషయాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీకి జలమండలి నుంచి వాటర్ కనెక్షన్లు ఉన్నా, వాటిని తాగు నీటిగా వినియోగించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటున్నది. జీహెచ్ఎంసీలో ఆర్థిక సంక్షోభం తలెత్తకముందు, కరోనా విపత్కర పరిస్థితులకు ముందు ప్రతి విభాగం, ప్రతి అంతస్తులో మినరల్ వాటర్ను ఉన్నతాధికారులు, సిబ్బంది, సందర్శకులంటూ తారతమ్యం లేకుండా తాగు నీటిని అందుబాటులోకి ఉంచేవారు. కానీ ఇప్పుడు జీహెచ్ఎంసీలో తాగునీటి కటకట నెలకొనడంతో అధికారులు, సిబ్బంది దాహం దాహం అంటూ అల్లాడిపోతున్నారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కొన్ని విభాగాలకు మినరల్ వాటర్ బబుల్స్ సప్లై అవుతుండగా, వాటికి ఆయా విభాగాల అధిపతులే బిల్లులు చెల్లించి తెప్పించుకుంటున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఇంటింటి చెత్త సేకరణ, డంపింగ్ యార్డుకు తరలించడంతో పాటు చెత్తను సైంటిఫిక్గా ల్యాండీ ఫీల్ చేసేలా 14 ఏళ్ల క్రితం ఒప్పందం చేసుకున్న రాంకీ సంస్థ కొంతకాలం క్రితం రాంకీ సస్టైనబుల్ పేరిట ప్రతి అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లలో తాగు నీటిని అందుబాటులోకి తెచ్చింది. తొలుత బాగానే మినరల్ వాటర్గా గొంతు తడిపిన ఈ నీటిలో ప్రస్తుతం నాణ్యత పెద్దగా కనిపిం చకపోవడంతో పాటు రకరకాల వాసనలు వస్తుండడంతో ఆ నీటిని సేవించేందుకు సిబ్బంది భయపడుతున్నారు. ఇక, నాలుగో తరగతికి చెందిన ఉద్యోగులు మధ్యాహ్నం భోజనం తర్వాత గత్యంతరం లేక రాంకీ సస్టైనబుల్ వాటర్నే సేవిస్తూ రకరకాల ఆరో గ్యపరమైన సమస్యలను ఎదుర్కుంటున్నట్లు సమాచారం.

కొందరికే పరిమితమైన మినరల్ వాటర్ సప్లై

ట్యాంక్ బండ్ సమీపంలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కొందరు అధికారు లకే మినరల్ వాటర్ సప్లై జరుగుతున్నదని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా జీహె

చ్ఎంసీ పరిధిలోని ప్రజలకు మౌలిక ఏర్పాట్ల ను అందించాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీపై ఉన్నా, ప్రధాన కార్యాలయంలో సందర్శ కులకు కనీసం తాగునీరు అందుబాటులో లేదు. బయటి నుంచి వివిధ రకాల పనుల మీదు ప్రధాన కార్యాలయానికి రాకపోకలు సాగిస్తున్న సందర్శకులకు దాహం వేస్తే వాటర్ బాటిల్ కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి నెలకొన్నది. రాంకీ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి అంతస్తు లో తాగునీటి యంత్రాలను ఏర్పాటు చేసినా, వాటిలో నుంచి వస్తున్న నీటిలో స్వచ్ఛత ఎంత, కనీసం పరిశుభ్రమైన నీరు సరఫరా అవుతుందా అనే విషయాన్ని కూడా పట్టిం చుకునే నాథుడే లేడు. ఈ క్రమంలో కొందరు అధికారుల ఛాంబర్లలో మాత్రమే చిన్న సైజు మినరల్ వాటర్ బాటిల్స్ దర్శనమిస్తున్నాయి. నగరవాసుల అవసరాలు, కనీసం ప్రధాన కార్యాలయానికి వచ్చే సందర్శకు లకు తాగునీరు వంటివి అందుబాటులోకి తెస్తూ, పేరుకు తగ్గట్టుగా మౌలిక వసతుల కల్పనలో పురోగమనం చెందాల్సిన జీహెచ్ఎంసీలో ఇష్టారాజ్య నిర్ణయాలు, తరుచూ బయటపడుతున్న అక్రమాలు, అవకతవ కలు, అధికారుల అక్రమార్జనలు వంటి విషయాలతో తిరోగమనం చెందుతున్నదనే వాదనలున్నాయి.

ఇవి కూడా చదవండి