Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

Setwin Services to Expand Across More Areas in the State: MD M. Upender Reddy

Setwin Managing Director M. Upender Reddy announced plans to expand the public sector undertaking's services to more regions across the state during Independence Day celebrations.

nagendra15 August 2026, 8:10 AM8 व्यूtrinetnews.com
Setwin Services to Expand Across More Areas in the State: MD M. Upender Reddy

Share this story

Share link keeps your language (?lang=)

రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సెట్విన్ సేవలను రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పురానిహవేలీ లోని సెట్విన్ ప్రధాన కార్యాలయంలో 80 వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ ఎండీ ఉపేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వ సహకారంతో తనవంతు సహాయ సహకారాలను అందిస్తానని అన్నారు. త్వరలోనే మరికొన్ని ప్రాంతాలలో సెట్విన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా సంస్థ పురోభివృద్ధికి కృషి చేయడంతో పాటు, మంచి పేరును తీసుకురాడానికి అంకితభావంతో పని చేయాలనీ సూచించారు. కార్యక్రమంలో సెట్విన్ అకౌంట్స్ ఆఫీసర్ సురేష్ బాబు, కేర్ టేకర్ చంద్రయ్య,

ట్రైనింగ్ సెక్షన్ ఇంచార్జి నవీన్ కుమార్, ఆసిఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Photo caption... పురాని హవేలీ లోని సెట్విన్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం ఉపేందర్ రెడ్డి చిత్రంలో అకౌంట్ ఆఫీసర్ సురేష్ బాబు తదితరులు ఉన్నారు

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →