బుధవారం7 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,629+1.00%
NIFTY22,663+1.07%
22K₹1,37,860/10g+0.05%
భాషలు

తాజా వార్తలు

అలరించిన సీనియర్ సిటిజన్ సినీ సంగీత విభావరి

A musical concert titled 'Karaoke' was held at Ravindra Bharathi to mark World Senior Citizens Day, featuring cultural performances and lifetime achievement awards.

nagendra22 August 2026, 8:59 PM7 చూసులుtrinetnews.com
అలరించిన సీనియర్ సిటిజన్ సినీ సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 22: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నాద అమిల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే పురస్కారించుకుని రవీంద్ర భారతి లోని ఆడిటోరియంలో “కరావుకే” పేరిట నిర్వహించిన సంగీత విభావరి వీక్షకులను అలరించింది. ఈ సందర్భంగా ప్రఖ్యాత కర్ణాటక సంగీత మహా విద్వాన్ ఆకెళ్ల మల్లికార్జున శర్మ, ప్రముఖ గిటారిస్ట్, సంగీత దర్శకుడు సాలూరి వాసు రావులకు జీవితకాల సాఫల్య పురస్కారాలతో పాటు అశ్విని హోమియోపతి చైర్మన్ అశ్విని సుబ్బారావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, లైన్స్ క్లబ్ వ్యవస్థాపకులు సౌజన్య చౌదరీ, మాజీ డీజీపీ ఎస్కే జయచంద్రలకు విశిష్ట సీనియర్ సిటిజన్స్ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా

ప్రముఖ సంగీత విద్వాంసుడు విద్వాన్ జొన్నలగడ్డ శ్రీరామ్ బృందంచే నామసంకీర్తనలతో పాటు స్వాతి సోమనాథ్ విద్యార్థులచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పురస్కార గ్రహీత అశ్విని సుబ్బారావు మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్ల వారి సేవలు గుర్తించి ఇలాంటి పురస్కారాలు ప్రదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ ఫౌండేషన్ కు తనవంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాద అమీల్ ఫౌండేషన్ ఫౌండర్ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →

అమెరికాలో ఘనంగా ఎస్పీ బాలు ఆరవ వర్ధంతి వేడుకలు

అమెరికాలో ఘనంగా ఎస్పీ బాలు ఆరవ వర్ధంతి వేడుకలు

అంతర్జాల వేదిక గా విఖ్యాత గాయకుడు బాల సుబ్రహ్మణ్యం వర్థంతి న్యూయార్క్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 30:అమెరికా లోని న్యూ యార్క్ నగరం లో విఖ్యాత గాయకుడు పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం అభిమానులు స్థాపిం

మిగతా చదవండి →