సంగీత విభావరి, శ్రీకృష్ణ రాయబారం నాటక ప్రదర్శన
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 7:
రుద్ర-శివ సాంస్కృతిక సంస్థ 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవాన్ని సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖులు, కళాకారులు, వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రతిభావంతులను సత్కరించనున్నారు.
కార్యక్రమంలో భాగంగా నెల్లుట్ల రవీందర్‌రావుకు ‘రుద్ర-శివ జాతీయ ప్రతిభా పురస్కారం’ ప్రదానం చేయనున్నారు. పలువురు ప్రముఖులు, సాహితీ, సాంస్కృతిక రంగాలకు చెందిన విశిష్ట అతిథులు సభా కార్యక్రమంలో పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు సంగీత విభావరి నిర్వహించనుండగా, అనంతరం ‘శ్రీకృష్ణ రాయబారం’ పూర్తి నాటకాన్ని ప్రదర్శించనున్నారు. రాత్రి 8 గంటలకు ముఖ్య అతిథుల సమక్షంలో సభా కార్యక్రమం, ప్రతిభా పురస్కారాల ప్రదానం జరగనుంది.
చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ మెయిన్ హాల్‌లో సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. కళాభిమానులు, సాహితీవేత్తలు, సంగీత ప్రియులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రుద్ర-శివ సాంస్కృతిక సంస్థ నిర్వాహకులు కోరారు.






