హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 15: చిక్కడపల్లిలోని మామ కేఫ్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడికి రోహిత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజించి ప్రత్యేక హారతి సమర్పించారు.
ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ విఘ్నాలను తొలగించి అందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలందరూ ఆనందం, ఐక్యతతో జీవించాలని ఆకాంక్షించారు. పూజా కార్యక్రమం భక్తిపూర్వక వాతావరణంలో కొనసాగింది.





