హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 8:
ప్రముఖ సంగీత దర్శకుడు కీ.శే. రమేష్ నాయుడు స్మరణలో ఆర్‌కే ఎంటర్‌టైనర్స్ ఆధ్వర్యంలో 23వ కార్యక్రమంగా తెలుగు, హిందీ సినీ గీతాల ప్రత్యేక సంగీత విభావరిని మంగళవారం నిర్వహిస్తున్నారు.
‘తాడి సెట్టు తల్లి కాదూ..!’, ‘కాకినాడ రేవు కాడ..!’, ‘కడగంటి కొలకుల్లో..!’, ‘Yeh Chand Yeh Taare..!’ తదితర మధుర గీతాలతో సంగీతాభిమానులను అలరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. గాయనీ గాయకులు శ్రీమతి కల్పన, శ్రీమతి రాజ్యలక్ష్మి, శ్రీమతి పావని, శ్రీమతి కిరణ్మయి తమ గానంతో అలరించనున్నారు.
ఈ కార్యక్రమంలో డా. శంకర్ రామిశెట్టి, ఆర్‌కే ఎంటర్‌టైనర్స్ వ్యవస్థాపకుడు, బహుముఖ గాయకుడు, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ మాజీ అసిస్టెంట్ కమిషనర్ ప్రత్యేకంగా పాల్గొననున్నారు. అలాగే మురళి, రవిప్రసాద్, జగదీశ్, భాస్కర్, మహాదేవ్ తదితరులు పాల్గొననున్నారు.
హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో సాయంత్రం 4.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. సంగీతాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.






