హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ ఆగస్టు 20: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ‘సి’ డివిజన్ వన్ డే లీగ్ ఛాంపియన్ మ్యాచ్‌లో రిలయన్స్ సి.సి. vs అభినవ్ కోల్ట్స్ సి.సి. తలపడ్డాయి.
తనుష్ రాథోడ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రిలయన్స్ సి.సి.కి భారీగా 376 పరుగుల విజయం!
ముందుగా బ్యాటింగ్ చేసిన రిలయన్స్ సి.సి. 50 ఓవర్లలో 421/5 పరుగులు చేసింది. ఇందులో తనుష్ రాథోడ్ 153 బంతుల్లో 79 పరుగులు చేసి, 11 ఫోర్లు బాదాడు.
422 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన అభినవ్ కోల్ట్స్ సి.సి. 17.3 ఓవర్లలో కేవలం 85 పరుగులకే ఆలౌట్ అయింది.
బౌలింగ్‌లోనూ సత్తా చాటిన తనుష్ రాథోడ్ 4.3 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
తనుష్ రాథోడ్ అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రిలయన్స్ సి.సి. ఘన విజయం సాధించింది.





