Friday9 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,37,889/10g-0.16%
भाषाएँ

Latest News

'రా కింగ్' మంచు మనోజ్ "డేవిడ్ రెడ్డి" సినిమా నుంచి నటి రమ్యకృష్ణ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ "డేవిడ్ రెడ్డి" చిత్రంలో కమల రెడ్డి పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్న రమ్యకృష్ణ

On the occasion of Ramya Krishnan's birthday, the makers of 'David Reddy' starring 'Ra King' Manchu Manoj have released a fierce special poster.

nagendra16 September 2026, 2:02 AM2 व्यूtrinetnews.com
'రా కింగ్' మంచు మనోజ్ "డేవిడ్ రెడ్డి" సినిమా నుంచి నటి రమ్యకృష్ణ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ "డేవిడ్ రెడ్డి" చిత్రంలో కమల రెడ్డి పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్న రమ్యకృష్ణ

Share this story

Share link keeps your language (?lang=)

'రా కింగ్' మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా "డేవిడ్ రెడ్డి". ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా "డేవిడ్ రెడ్డి" సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.

ఈ రోజు నటి రమ్యకృష్ణ బర్త్ డే సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ "డేవిడ్ రెడ్డి" సినిమా నుంచి ఆమె బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ కమల రెడ్డి పాత్రలో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఈ పోస్టర్ లో ఆమె ఖడ్గంతో శత్రువులను తుదముట్టించి తన ఆసనంపై కూర్చుని ఫెరోషియస్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. రమ్యకృష్ణ కెరీర్ లో కమల రెడ్డి పాత్ర ఒక ఐకానిక్ క్యారెక్టర్ గా గుర్తుండిపోనుంది.

నటీనటులు - 'రా కింగ్' మంచు మనోజ్, మరియా ర్యబోషప్క, రమ్యకృష్ణ, ఆర్. పార్తీబన్, కాంచన, తదితరులు

టెక్నికల్ టీమ్

---------------------

ఆర్ట్ - రవి జక్కుల

కాస్ట్యూమ్స్ - హైందవి సుధ

యాక్షన్ - సుప్రీమ్ సుందర్

ఎడిటింగ్ - ఉజ్వల్ కులకర్ణి

డీవోపీ - ఆచార్య వేణు

మ్యూజిక్ - రవి బస్రూర్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - కొట్టు రవికుమార్

ప్రొడ్యూసర్స్ - భరత్ మోటుకూరి, నల్లగంగుల వెంకట్ రెడ్డి

స్క్రిప్ట్, డైరెక్టర్ - హనుమరెడ్డి యక్కంటి

పీఆర్ఓ - సురేష్ (ఎస్ కె మీడియా)

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →