హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ ఆగస్టు 25: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ‘సి’ డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆల్ సెయింట్స్ సి.సి. మరియు రాఘవి జాతశ్రీ సి.సి. జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఎం. వికాస్ కుమార్, ఎ. కార్తికేయన్ అద్భుత ప్రదర్శనతో రాఘవి జాతశ్రీ క్రికెట్ క్లబ్‌కు ఘన విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన ఆల్ సెయింట్స్ సి.సి. జట్టు 17.4 ఓవర్లలో కేవలం 49 పరుగులకే ఆలౌటైంది. రాఘవి జాతశ్రీ సి.సి. బౌలర్లలో ఎం. వికాస్ కుమార్ 6.4 ఓవర్లలో కేవలం 3 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, ఎ. కార్తికేయన్ 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు సాధించారు.
50 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాఘవి జాతశ్రీ సి.సి. జట్టు కేవలం 11.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. సిద్ధస్మరణ్ బోయిని 2 ఫోర్లతో 34 పరుగులు చేసి జట్టు ఘన విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ ఘన విజయం సందర్భంగా కోచ్‌లు టి.కె. నాగరాజ్, జె. సాయి లక్ష్మణ్, రేవంత్ సాయి, జట్టు కార్యదర్శి శ్రీమతి టి. దీపిక క్రీడాకారులను అభినందించారు.





