సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,107+5.45%
NIFTY25,045+5.18%
22K₹1,33,390/10g+1.55%
భాషలు

తాజా వార్తలు

కుత్బుల్లాపూర్ డివిజన్ ACP Sir గారు, రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక మండపాల నిర్వాహకులు మరియు ప్రజలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాలపై ఏసీపీ ఆధ్వర్యంలో నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, డీజేలకు దూరంగా ఉంటూ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. నిమజ్జన సమయంలో తగిన భద్రతా చర్యలు తీసుకుంటూ పోలీసులకు సహకరించాలని కోరారు.

nagendra10 September 2026, 2:04 AM6 చూసులుtrinetnews.com
కుత్బుల్లాపూర్ డివిజన్ ACP Sir గారు, రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక మండపాల నిర్వాహకులు మరియు ప్రజలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 9:

ఈ సందర్భంగా ACP Sir గారు నిర్వాహకులతో మాట్లాడి, పండుగను ప్రశాంతంగా మరియు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన పలు సూచనలు చేశారు. అధిక శబ్దం వచ్చే సౌండ్ సిస్టమ్స్ మరియు వాయిద్యాలను వినియోగించవద్దని, సాధ్యమైనంత వరకు సంప్రదాయ బ్యాండ్ మరియు సంప్రదాయ వాయిద్యాలను మాత్రమే వినియోగించాలని సూచించారు.

పండుగ సందర్భంగా మద్యం సేవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి అసాంఘిక లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని ACP Sir గారు నిర్వాహకులకు మరియు భక్తులకు సూచించారు.

అదేవిధంగా, వినాయక విగ్రహాల నిమజ్జనం సమయంలో చెరువులు, కుంటలు మరియు ఇతర నిమజ్జన ప్రదేశాల వద్ద భక్తుల భద్రతకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని తెలిపారు.

వినాయక చవితి పండుగను శాంతియుతంగా, సురక్షితంగా మరియు సజావుగా నిర్వహించేందుకు నిర్వాహకులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని ACP Sir గారు కోరారు.

ఈ సమావేశంలో జీడిమెట్ల PS SHO శ్రీ కె. రవి కుమార్ గారు, సెక్టార్ SIs శ్రీ ప్రేమ్ సాగర్, శ్రీనివాస్, శ్యామ్ బాబు, రామచంద్రయ్య మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య