ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

ఆదివారం6 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:26 pm

ఆదివారం

6 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:26 pm

SENSEX76,515-0.57%
NIFTY23,898-0.76%
హైదరాబాద్ 22K₹1,45,232/10g+2.96%
హైదరాబాద్ 24K₹1,58,435/10g+2.96%
వెండి₹2,18,997/kg+3.30%

తాజా వార్తలు

హమారా ప్రసాద్‌పై ఓయూ పీఎస్ లో ఫిర్యాదు చేసిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్

Dakshina Janata Party National Coordinator Prof. Gali Vinod Kumar filed a complaint at the Osmania University Police Station against Hamara Prasad over his book 'Kalpita Nayakudu'.

nagendra6 September 2026, 6:25 AM0 చూసులుtrinetnews.com
హమారా ప్రసాద్‌పై ఓయూ పీఎస్ లో ఫిర్యాదు చేసిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్,ఓయూ,ట్రై నెట్ న్యూస్, సెప్టెంబర్05

హమారా ప్రసాద్‌ రచించిన ‘కల్పిత నాయకుడు’ పుస్తకంలోని అంశాలపై దక్షిణ జనతా పార్టీ జాతీయ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గాలి వినోద్‌కుమార్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వ్యక్తిత్వాన్ని, సామాజిక సేవలను కించపరిచే విధంగా పుస్తకంలో అంశాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక ఆర్ఎస్ఎస్‌, బీజేపీ కుట్ర ఉందని విమర్శించారు.

ఈ మేరకు గాలి వినోద్‌కుమార్‌ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో హమారా ప్రసాద్‌పై ఫిర్యాదు చేశారు. పుస్తకంలోని అంశాలను సమగ్రంగా పరిశీలించి, అభ్యంతరకరమైన విషయాలపై విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు. జాతీయ నాయకుడు అంబేద్కర్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేలా, సమాజంలో విభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలు లేదా రచనలు ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అంబేద్కర్‌ రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించడంతో పాటు సామాజిక అసమానతలు, కుల వివక్షకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడారని గాలి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. అలాంటి మహనీయుడి చరిత్రను వక్రీకరించడం, ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. ‘కల్పిత నాయకుడు’ పుస్తకంలోని అంశాలపై సమగ్ర విచారణ జరిపి, అభ్యంతరకర విషయాలు ఉన్నట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నేతలు దర్శన్, ఉదయ్, నవీన్ లతో పాటు డిజెపి నేతలు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

ఎల్ నినో ప్రభావానికి తోడుగా విద్యుత్ కోతలతో వరిపంటకు నీటి పారుదలలో సమస్యలు చేతికి అందివచ్చే సమయంలో నీటిలభ్యతలో అసౌకర్యాలు

ఎల్ నినో ప్రభావానికి తోడుగా విద్యుత్ కోతలతో వరిపంటకు నీటి పారుదలలో సమస్యలు  చేతికి అందివచ్చే సమయంలో నీటిలభ్యతలో అసౌకర్యాలు

Paddy farmers in Yadadri Bhuvanagiri district are struggling to save their crops as El Nino and severe power cuts disrupt irrigation just before harvest.

మిగతా చదవండి →

కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలనపై బీఆర్ఎస్ సమరభేరి పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలి – జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి – యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి

కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలనపై బీఆర్ఎస్ సమరభేరి  పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలి – జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి – యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి

BRS staged a massive protest in Alair demanding the Congress government clear pending fee reimbursements and fulfill youth declaration promises.

మిగతా చదవండి →