హైదరాబాద్, రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబరు 4 :
భారతీయ సాంప్రదాయ కళలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు రమణారావు అన్నారు. శివ పార్వతి నాట్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రభుత్వ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ‘మంజీరనాదం’ పేరిట సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు రవీంద్రభారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమణారావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ నృత్య, కళా సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు కళాకారులను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. తమ పిల్లలను కళా రంగంలో ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. సభకు ముందు
శివ పార్వతి నాట్య అకాడమీ వ్యవస్థాపకులు, డైరెక్టర్ చెట్టి నాగ శేఖర్ నిర్వహణలో కళాకారులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డా. ఆర్. ప్రసన్న రాణి, దేదీప్య రావు, హరినాథ్ రెడ్డి, సత్య మాస్టర్, డా. శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.








