శనివారం17 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
22K₹1,36,320/10g-0.23%
భాషలు

తాజా వార్తలు

శక్తి స్కీమ్ రద్దు చేయాలని పోస్ట్‌కార్డుల ఉద్యమం

BRSV leaders and polytechnic students staged a postcard protest in Suryapet, demanding the immediate revocation of the Shakti Scheme.

nagendra31 August 2026, 7:56 PM8 చూసులుtrinetnews.com
శక్తి స్కీమ్ రద్దు చేయాలని పోస్ట్‌కార్డుల ఉద్యమం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

పాలటెక్నిక్ విద్యార్థులతో కలిపి పోస్ట్ కార్డులు పంపిన BRSV నాయకులు..

సూర్యాపేట: ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 31: శక్తి స్కీమ్ (G.O. నం.97) ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి బిఆర్ఎస్వీ నాయకులు విద్యార్థులతో కలిసి పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా BRSV నాయకులు బంటు సందీప్ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్న శక్తి స్కీమ్ (G.O. నం.97)ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్‌కార్డుల ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులతో పోస్ట్‌కార్డుల ఉద్యమం నిర్వహించమన్నారు. శక్తి స్కీమ్ వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శక్తి స్కీమ్ వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. విద్యార్థుల అభిప్రాయాలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, విద్యార్థుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు విద్యార్థుల తరఫున ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వీ నాయకులు ఖమ్మంపాటి ఉదయ్, పడిదల నవనీత్, బొల్లం వినయ్, ఎలగబోయిన వంశీ, సాయి, వెంకట్, అభి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

రవీంద్రభారతిలో ఘనంగా వెన్నముద్దల బతుకమ్మ సంబరాలు

రవీంద్రభారతిలో ఘనంగా వెన్నముద్దల బతుకమ్మ సంబరాలు

రవీంద్రభారతిలో ఘనంగా వెన్నముద్దల బతుకమ్మ ఆడిపాడిన తెలంగాణ రెడ్డి సమితి మహిళలు పూలను, ప్రకృతిని ప్రేమించే పండుగ బతుకమ్మ: ఏనుగు నరసింహారెడ్డి హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 17: రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక

మిగతా చదవండి →

దసరాకు ఊరెళ్లే ప్రయాణికుల కోసం 7 వేల ప్రత్యేక బస్సులు: టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి ​జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్ ) లో ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించిన ఎండీ వై.నాగిరెడ్డి

దసరాకు ఊరెళ్లే ప్రయాణికుల కోసం 7 వేల ప్రత్యేక బస్సులు: టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి ​జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్ ) లో ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించిన ఎండీ వై.నాగిరెడ్డి

మిగతా చదవండి →