Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,38,264/10g+0.11%
भाषाएँ

Latest News

మైలార్‌గడ్డ హత్య కేసు ఛేదించిన పోలీసులు..

Chilakalguda police arrested a 36-year-old man in connection with the murder of Immadi Srinivas over financial disputes in Mylargadda.

nagendra17 September 2026, 11:39 PM2 व्यूtrinetnews.com
మైలార్‌గడ్డ హత్య కేసు ఛేదించిన పోలీసులు..

Share this story

Share link keeps your language (?lang=)

సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 17: చిలకలగూడ మైలార్‌గడ్డలో ఇమ్మడి శ్రీనివాస్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో భోలక్‌పూర్‌కు చెందిన మహమ్మద్ నిజాముద్దీన్ అలియాస్ నిజాం (36) ను చిలకలగూడ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం 6 నుంచి 6.30 గంటల మధ్య శ్రీనివాస్‌ తన యాక్టివాపై సమీపంలోని వైన్‌ షాప్‌ కు వెళ్లాడు. రాత్రి 7.10 నుంచి 7.20 గంటల సమయంలో మైలార్‌గడ్డ రోడ్డుపై నిజాముద్దీన్‌ కత్తితో శ్రీనివాస్‌ పై దాడి చేసి పరారైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ ను తొలుత ఆర్టిసి ఆసుపత్రికి, అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు సుమన్‌ తో నిందితుడికి పరిచయం ఉండటంతో పాటు వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. షేర్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో నష్టాల కారణంగా సుమన్‌ అప్పులు చేసి 2023 నవంబర్‌ లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తనకు రావాల్సిన డబ్బు చెల్లించాలని నిజాముద్దీన్‌ డిమాండ్‌ చేయడంతో పాటు, ఆర్థిక వివాదంపై సివిల్‌ కేసు కూడా దాఖలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్‌ పై దాడి జరిగినట్లు పేర్కొన్నారు. నిందితుడి నుంచి నేరానికి ఉపయోగించిన పదునైన వంకర కత్తి, రక్తపు మరకలున్న దుస్తులు ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ ఎస్ హెచ్ ఓ వి. రామకృష్ణ, ఎస్ఐ జె. రాకేష్‌, వారి బృందాలు ఏసీపీ కె. శశాంక్‌ రెడ్డి పర్యవేక్షణలో, అదనపు డీసీపీ జె. నర్సయ్య నాయకత్వంలో దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు డీసీపీ రక్షిత కృష్ణ మూర్తి, తెలిపారు. ఆర్థిక, వ్యక్తిగత వివాదాలను చట్టబద్ధమైన మార్గాల్లోనే పరిష్కరించుకోవాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →