యువ రచయిత మురళీమోహన్ మోహన్ రాజు రచించిన " బతుకు బండి " కవితా సంపుటిని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి ఆవిష్కరించారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం హైదరాబాద్ చిక్కడపల్లి లోని త్యాగరాయ గానసభ నందు ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా డాక్టర్ సేవారత్న కొండూరు హరినారాయణకు అంకితం చేస్తూ పుస్తకావిష్కరణ జరిగింది. ఈసందర్భంగా మధుసూదనా చారి మాట్లాడుతూ మురళీమోహన్ రాజును నేను అన్నీ కోణాల్లో చూస్తున్నాను. కవిగా, రచయితగా, కళాకారుడిగా, సమాజ సేవకుడిగా ఒక్క మాటలో చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞాశాలియైన రాజు సేవలు సమాజానికి అవసరమని తెలిపారు. ఈకార్యక్రమంలో డాక్టర్ కొండూరు హరినారాయణ రెడ్డి, డాక్టర్ బూర్గుల మధుసూదనరావు, నిర్మలా ప్రభాకర్, ఎన్. వేణుగోపాల శర్మ, రచయిత దుబ్బా భాస్కర్ రావు, డాక్టర్ రాధ కుసుమ, రచయిత మురళీమోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
"బతుకు బండి" పుస్తకావిష్కరణ
Telangana Legislative Council Opposition Leader Sirikonda Madhusudhana Chary launched the poetry book 'Batuku Bandi' by young writer Muralimohan Mohan Raju.

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఇవి కూడా చదవండి
మిమిక్రీ రత్న 'స్వరముఖి' చంద్రముఖి చంద్రశేఖర్‌కు స్వర్ణ కంకణం బహుకరణ

Renowned mimicry artist 'Swaramukhi' Chandramukhi Chandrasekhar was honored with the Swarna Kankanam at Thyagaraya Gana Sabha to mark 35 years in the field.
మిగతా చదవండి →అలరించిన 'వాగ్దేవి మెలోడీస్' తెలుగు - హిందీ సినీ సంగీత విభావరీ సీజన్-2

Vagdevi Melodies organized Season 2 of its Telugu and Hindi film musical concert at Sri Thyagaraya Gana Sabha, delighting music lovers.
మిగతా చదవండి →మిమిక్రీ రత్న 'స్వరముఖి' చంద్రముఖి చంద్రశేఖర్‌కు స్వర్ణ కంకణం బహుకరణ

A grand felicitation event was held at Thyagaraya Gana Sabha to celebrate Chandramukhi Chandrasekhar completing 35 years in mimicry.
మిగతా చదవండి →శంకర నారాయణ అరణ్య శతకం ఆవిష్కరణ

Renowned journalist and writer Shankara Narayana’s latest work, Aranya Shatakam, focusing on environmental conservation, was launched at Thyagaraja Gana Sabha.
మిగతా చదవండి →