హైదారాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 30:
సికింద్రాబాద్, 30-08-2026:
భారతీయ జనతా పార్టీ బన్సీ లాల్ పేట్ డివిజన్ అధ్యక్షులు రామంచ మహేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అనగా 30-08-2026 మధ్యాహ్నం 11 గంటలకు డివిజన్ కార్యాలయంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 137వ "మన్ కీ బాత్" కార్యక్రమాన్ని సామూహికంగా శ్రవణం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ నగర్ అధ్యక్షులు గుండా గోని భరత్ గౌడ్, పార్లమెంట్ కన్వినర్ T. రాజశేఖరరెడ్డి, BC మోర్చా జిల్లా అధ్యక్షులు Y. సురేష్ కుమార్, K. M. కృష్ణ, ఎలకొండ శ్రీనివాస్ ముదిరాజ్, K. కృష్ణ, శీలం శివలింగం, సత్యనారాయణ గౌడ్, వెంకట్ పతి రాజ్, B. పరమేష్, పవన్ పటేల్, కళ్యాణ్, గణేష్, బీంరావ్ తదితర నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
వక్తలు మాట్లాడుతూ: ఇది 137వ "మన్ కీ బాత్" కార్యక్రమం అని, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా దేశ ప్రధాని నేరుగా ప్రజలతో మాట్లాడే అపూర్వమైన కార్యక్రమం ఇదని కొనియాడారు.
ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
1. యువత & స్టార్టప్‌లు: దేశ యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా వినూత్న ఆలోచనలు, స్టార్టప్‌లతో ముందుకు వస్తున్నారని ప్రధాని ప్రశంసించారు. చిన్న ఆలోచన అయినా సరైన కృషితో సమాజంలో పెద్ద మార్పు తీసుకురాగలదని పేర్కొన్నారు.
2. మహిళా సాధికారత - PM SVANidhi: PM SVANidhi పథకం లబ్ధిదారులలో 46% మంది మహిళలు ఉన్నారని తెలిపారు. వీధుల వెంబడి వ్యాపారం చేస్తూ లక్షలాది మంది మహిళలు స్వయం ఉపాధి పొంది మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తున్నారని అభినందించారు.
3. డ్రగ్స్ వ్యతిరేకత: సమాజంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, "నశే కీ లత్" ఒక వ్యక్తికి మాత్రమే కాకుండా కుటుంబానికి, సమాజానికి నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రధాని అభినందించారు.
కార్యక్రమం చివరలో దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రధాని పిలుపును ముందుకు తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఇట్లు
ఎలకొండ శ్రీనివాస్ ముదిరాజ్
జిల్లా మీడియా కార్డనేటర్





