ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం26 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:34 pm

బుధవారం

26 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:34 pm

SENSEX77,568+0.04%
NIFTY24,276+0.18%
హైదరాబాద్ 22K₹1,53,437/10g+1.30%
హైదరాబాద్ 24K₹1,67,386/10g+1.30%
వెండి₹2,27,362/kg-1.20%

తాజా వార్తలు

Plant Trees for a Healthy Future: Former Minister Talasani Srinivas Yadav

Former Minister and Sanath Nagar MLA Talasani Srinivas Yadav urged citizens to plant saplings widely during a Vanamahotsavam event in Hyderabad.

nagendra26 August 2026, 2:59 AM2 చూసులుtrinetnews.com
Plant Trees for a Healthy Future: Former Minister Talasani Srinivas Yadav

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

పత్రికాప్రకటన

25.08.2026

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం రాంగోపాల్ పేట డివిజన్ లోని సింది కాలనీలో గల వెంకట్రావ్ పార్క్ లో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం కాలనీ వాసులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్క్ లో తిరిగి పరిశీలించారు. పార్క్ లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలలో మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. పచ్చదనం పెరిగితే కాలుష్య నియంత్రణ జరిగి ఆరోగ్య వంతమైన జీవితాన్ని గడపగలమని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉన్నదని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హరితహారం అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో, రహదారుల వెంట, ప్రభుత్వ ఖాళీ స్థలాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగిందని వివరించారు. ఫలితంగా 2021 నాటికి 21,214 చదరపు కిలోమీటర్ల కు పెరిగిందని చెప్పారు. భవిష్యత్ తరాలకు మనం ఇవ్వాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదని ఆరోగ్యవంతమైన జీవితమని అని అన్నారు. కార్యక్రమంలో కవాడిగూడా సర్కిల్ DC పుష్పలత, హార్టికల్చర్ DD చంద్రశేఖర్, సత్యనారాయణ, AE చంద్రశేఖర్, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, రాంగోపాల్ పేట డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, ఆంజనేయులు, అరుణ్ భట్, గణేష్, కోటేశ్వర్ గౌడ్, దీపక్ గుప్త, చంద్ర ప్రకాష్ , కాలనీ వాసులు ప్రవీణ్, పత్తిపాక సంజయ్ తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి