Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,256/10g+1.54%
भाषाएँ

Latest News

Patta passbooks to be issued for dispute-free lands within next year: Minister Ponguleti

Ministers Ponguleti Srinivas Reddy and Komatireddy Venkat Reddy distributed pattas for 1,044 acres in Suryapet district, assuring land surveys across Telangana.

nagendra30 August 2026, 2:00 AM8 व्यूtrinetnews.com
Patta passbooks to be issued for dispute-free lands within next year: Minister Ponguleti

Share this story

Share link keeps your language (?lang=)

-తుంగతుర్తి నియోజకవర్గంలో 1044 ఎకరాలకు పాస్ బుక్ పట్టాల పంపిణీ

-హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి

సూర్యాపేట, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 29:

రానున్న సంవత్సర కాలంలో రాష్ట్రవ్యాప్తంగా వివాద రహిత భూములన్నిటీని (ప్రతి అంగుళం) సర్వే చేసి భూ ఆసాములకు పట్టాలు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతనకల్ మండల కేంద్రంలో నూతనకల్, మద్దిరాల మండలాలకు సంబంధించి దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న 15 గ్రామాల లోని 1061 మంది రైతులకు 1044 ఎకరాలకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. సాగు చేసుకుంటున్న భూములకు ఏళ్ళ తరబడిగా పట్టాలు లేక రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని, దాని ద్వారా వివాద రహిత భూములన్నింటికీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రతి అంగుళం భూమిని అధికారులు సర్వే చేసి నిజమైన ఆసాములకు హక్కు పత్రాలు అందించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మొదటి విడతన 70 గ్రామాలను ఎంపిక చేసుకొని సర్వే చేయించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పలుచోట్ల రెవెన్యూ, దేవాదాయ, అసైన్డ్ భూములు కబ్జాకు గురవుతుండడం తమ దృష్టికి వచ్చిందని, వీటిని అరికట్టేందుకు తాము కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా రానున్న సంవత్సరకాలంలో ప్రతి అంగుళాన్ని సర్వే చేస్తామని, వివాదారహిత భూములన్నింటికీ పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామని పునరుద్గాటించారు. పంచాయతీలేని భూములకు, భూములున్న ఆసాములు అందరికీ పట్టాలిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పట్టాలు ఇవ్వలేదని, ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి జనం బ్రహ్మ రథం పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 5500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, మూడవ, నాలుగో విడతల్లో కూడా ఇస్తామని ప్రకటించారు.

రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి

దశాబ్దాల రైతుల సమస్యలకు పరిష్కారం పట్టాలు ఇవ్వడమని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 5 లక్షల రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 36వేల కోట్ల రూపాయలతో హ్యం రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలతో రోడ్లు మంజూరు చేయడం జరిగిందని, మరో 200 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఉన్నాయని వెల్లడించారు. అలాగే సూర్యాపేట నియోజకవర్గం లోని అన్ని గ్రామాలకు డబుల్ రోడ్లను వేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లను ఎట్టి పరిస్థితులలో ఆపమని, గుడిసె ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి గుడిశెలేని తెలంగాణగా మారుస్తామని అన్నారు.

తుంగతుర్తి నియోజకవర్గానికి అదనపు ఇండ్లు, రోడ్లు మంజూరు చేయండి

తుంగతుర్తి నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న రోడ్లను మంజూరు చేయాలని, అదనంగా ఇండ్లు మంజూరు చేయాలని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు విజ్ఞప్తి చేశారు. పొలాలను సాగు చేసుకుంటున్న రైతులకు హక్కులు లేనందువల్ల ఎన్నో బాధలకు గురయ్యారని, అలాంటి 60 సంవత్సరాల సమస్య తీర్చినందుకు రెవెన్యూ మంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. భూమి అనేది రైతుకు ఆత్మ గౌరవం అని, భూమి హక్కు లేకుంటే గుర్తింపు ఉండదని అన్నారు.

1044 ఎకరాలకు పట్టాల పంపిణీ

నూతనకల్, మద్దిరాల మండలాలలో 1060 మంది రైతులకు 1044 ఎకరాలకు పట్టాల పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తెలిపారు. వివిధ కారణాలతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఇందులో భాగంగా నూతనకల్, మద్ధిరాల మండలాలలోని 15 గ్రామాలలో 3000 ఎకరాలకు పైగా భూములన్ని సర్వే చేసి పరిశీలించి రైతుల పొలాల వద్దకు వెళ్లి వారికి నోటీసులు ఇచ్చిన పిదప ముసాయిదా అర్హుల జాబితాను ప్రకటించడం జరిగిందని వెల్లడించారు. సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వడం జరుగుతున్నదని తెలిపారు. వీటితోపాటు భూభారతి కింద రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు కూడా ఇస్తున్నామని, ఖాతాలు లేని వారికి కూడా కొత్తగా ఖాతాలు ఇస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, సిసిఎల్ఏ సెక్రటరీ లోకేష్ కుమార్, ల్యాండ్ సర్వీస్ సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అడిషనల్ కలెక్టర్ హరి సింగ్, రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న లతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के छात्रों का स्नेह मिलन समारोह। हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर। पूर्व छात्रों का स्नेह मिलन समारोह उत्साहपूर्वक आयोजित किया गया।

और पढ़ें →

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से रविन्द्र भारती में एंगिलीपूला बతుకమ్మ के साथ ‘प्रजाला బతుకమ్మ–2026’ उत्सव शुरू होगा। 18 अक्टूबर को टैंक बंड पर सद्दूला बతుకమ్మ। हैदराबाद, 9 अक्टूबर (ट्रैनेट न्यूज):

और पढ़ें →

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

तत्काल प्रकाशन के लिए महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह हैदराबाद, ट्राइनेट न्यूज़, 9 अक्टूबर 2026: हैदराबाद के बेगमपेट स्थित सेंट फ्रांसिस महिला कॉलेज में 46वां दीक्षांत समारोह भव्य रूप से आयोजित किया गया।

और पढ़ें →

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर: तेलंगाना राज्य सरकार के पूर्व सलाहकार डॉ. के.वी. रमणाचारी ने कहा कि आज के युवाओं में दूसरों का भला करने की सोच होनी चाहिए।

और पढ़ें →