Friday9 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,003/10g+1.38%
भाषाएँ

Latest News

Organize Vinayaka Chavithi celebrations peacefully: ACP Gopalakrishna Murthy

Begumpet ACP Gopalakrishna Murthy urged pandal organizers to conduct Vinayaka Chavithi celebrations with devotion and in a peaceful environment.

nagendra6 September 2026, 6:34 AM6 व्यूtrinetnews.com
Organize Vinayaka Chavithi celebrations peacefully: ACP Gopalakrishna Murthy

Share this story

Share link keeps your language (?lang=)

బేగంపేట, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 5 :

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ మూర్తి నిర్వాహకులకు సూచించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి, డీసీపీ శ్రీధర్ ఐపీఎస్ సూచనల మేరకు బేగంపేట పోలీసుల ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుమారు 300 మంది వినాయక మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. మండపాల ఏర్పాటుకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ లేదా మల్కాజిగిరి పోలీస్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ముందుగానే అందించాలని సూచించారు. విద్యుత్, అగ్నిమాపక, పురపాలక శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందడంతో పాటు మండపాల ముఖ్య నిర్వాహకుల పేర్లు, ఫోన్ నంబర్లను పోలీసులకు నమోదు చేయాలన్నారు. ప్రధాన రహదారులు, రద్దీ కూడళ్లలో ట్రాఫిక్‌, పాదచారులకు ఇబ్బంది కలగకుండా మండపాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. మండపాల వద్ద ఇసుక బకెట్లు, నీరు, ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లు అందుబాటులో ఉంచాలని, రాత్రివేళల్లో కనీసం ఇద్దరు వాలంటీర్లు ఉండేలా చూడాలని సూచించారు. భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. లౌడ్‌స్పీకర్లను నిబంధనల మేరకే వినియోగించాలని, డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదన్నారు. మండపాల వద్ద భక్తి గీతాలు మాత్రమే ప్రసారం చేయాలని స్పష్టం చేశారు. నిమజ్జనం రోజు, సమయం, వాహనం, ఊరేగింపు రూట్‌ వివరాలను ముందుగానే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం, అల్లర్లు చేయడం, ఇతర మతాలు, వర్గాల మనోభావాలను దెబ్బతీసే నినాదాలు, ఫ్లెక్సీల ఏర్పాటును పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించినా, అత్యవసర పరిస్థితుల్లో 100, 112కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమావేశంలో బేగంపేట ఇన్‌స్పెక్టర్ సైదులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

यह भी पढ़ें

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के छात्रों का स्नेह मिलन समारोह। हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर। पूर्व छात्रों का स्नेह मिलन समारोह उत्साहपूर्वक आयोजित किया गया।

और पढ़ें →

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से रविन्द्र भारती में एंगिलीपूला बతుకమ్మ के साथ ‘प्रजाला బతుకమ్మ–2026’ उत्सव शुरू होगा। 18 अक्टूबर को टैंक बंड पर सद्दूला बతుకమ్మ। हैदराबाद, 9 अक्टूबर (ट्रैनेट न्यूज):

और पढ़ें →

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

तत्काल प्रकाशन के लिए महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह हैदराबाद, ट्राइनेट न्यूज़, 9 अक्टूबर 2026: हैदराबाद के बेगमपेट स्थित सेंट फ्रांसिस महिला कॉलेज में 46वां दीक्षांत समारोह भव्य रूप से आयोजित किया गया।

और पढ़ें →

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर: तेलंगाना राज्य सरकार के पूर्व सलाहकार डॉ. के.वी. रमणाचारी ने कहा कि आज के युवाओं में दूसरों का भला करने की सोच होनी चाहिए।

और पढ़ें →