హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 09:
అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షాన్ని ఇరుక్కుని పెట్టే విధంగా ప్రవర్తించవలసిన ప్రతిపక్షం ఎమ్మెల్సీలు ప్రవర్తించిన తీరుతో డిఫెన్స్ లో పడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు కావస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొంది. అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ వైఫల్యాలను ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలకు మంచి అవకాశం దొరికింది. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ సెషన్ తీర్మానాల సమయంలో సంబంధిత అంశాలపై ప్రభుత్వాన్ని
అసెంబ్లీలో ఎండగట్టడానికి అవకాశం ఉంది. అందులోనూ పదేళ్లపాటు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏ అంశాన్ని ప్రస్తావిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టొచ్చో చాలా బాగా తెలుసు. ఈ సమావేశాల్లో ప్రధానంగా 1000 రోజుల పాలనా వైఫల్యాలను ప్రస్తావించి సర్కారును టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు, సీనియర్ నాయకులు
కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పెద్ద కసరత్తే చేశారు. కానీ సొంతపార్టీకి చెందిన ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి దూకుడు తనం కారణంగా ప్లాన్ మొత్తం బెడిసి కొట్టిందనే చర్చ గులాబీ శ్రేణుల్లో చర్చ మొదలైంది.
వారిద్దరికీ దూకుడు స్వభావం ఎక్కువగా ఉందని సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియాలో కనిపించాలనే ఉద్దేశంతో సహనం కోల్పోయి శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మీద చేసిన అనుచితవ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూర్చిందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రెండ్రోజుల పాటు ఒకే అంశంపై చర్చే జరిగేలా
అధికార పార్టీ వేసిన స్కెచ్ సక్సెస్ అవడంతో పాటు సంబంధిత ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలంటూ శాసన మండలికి తీర్మానం పంపడం, ఆ ఇద్దరిపై సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ వేటుపడటంతో అధికార పార్టీ పైచేయి సాధించినట్టు అయ్యింది. మీడియాలో హైలెట్
కావాలనే ఆత్రం సమావేశాల ప్రారంభం రోజున అసెంబ్లీలోకి వెళ్లే సమయంలో పోలీసులతో జరిగిన తోపులాటలో ఆవేశంతో
శాసన సభాపతి పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో పాటు కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు పార్టీకి అభ్యంతకరంగా మారింది. నూతన ఎమ్మెల్యేలు మీడియాలో కనిపించాలనే ఉద్దేశంతో పోలీసులతో వాగ్వాదానికి దిగగా, ఇంకొందరు తాము ధరించిన టీ షర్ట్స్ విప్పారు. ఆ విధంగా వ్యవహరించడం వెనుక సీనియర్ ఎమ్మెల్యేల ప్రోత్సాహం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. స్లోగన్స్ తో కూడిన నల్లటి రంగు టీ షర్ట్స్ ను ధరించి వచ్చేందుకు సభలోకి అనుమతివ్వబోమని పోలీసులు చెప్పారు. దీంతో టీ షర్ట్స్ విప్పి, అర్ధనగ్నంగా సభలోకి వెళ్తామంటూ మాజీ మంత్రులు హంగామా చేయడం సరైనది కాదనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.






