ఒకరోజు నువ్వే ఏడుస్తావు!
నన్ను వదిలినందుకు నువ్వు నవ్వావు,
నా బాధను చూసి కూడా ఆనందించావు,
నీ దారిలో నేను అడ్డుగా ఉన్నానని,
నన్ను దూరం చేయడమే మంచిదనుకున్నావు.
నీకు నేను విలువ లేని వాడినయ్యాను,
నా ప్రేమ నీకు భారమైపోయింది,
నేను మాత్రం నిన్నే ప్రపంచంగా భావించాను,
నువ్వు మాత్రం నన్ను ఓ జ్ఞాపకంగా వదిలేశావు.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు,
రోజులు మారితే మనుషుల విలువ తెలుస్తుంది,
నేడు నీ కళ్లలో నవ్వు ఉన్నా,
రేపు అదే కళ్లలో కన్నీరు రావచ్చు.
నన్ను కోల్పోయిన బాధ నీకు తెలుస్తుంది,
నా స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరని గ్రహిస్తావు,
నాతో ఉన్న చిన్న చిన్న క్షణాలు,
నీ ఒంటరితనంలో పెద్ద జ్ఞాపకాలవుతాయి.
నన్ను వెతికే రోజులు వస్తాయి,
నా మాట వినాలని మనసు కోరుతుంది,
కానీ అప్పటికి నేను మారిపోయి ఉంటాను,
నీ కోసం ఎదురుచూసే మనసు నాలో ఉండదు.
నువ్వు నవ్విన ఆ విడిపోవు రోజు,
నాకు కన్నీటి పాఠం నేర్పింది,
ఒకరోజు అదే పాఠం నీ కళ్లకు నీళ్లు తెస్తుంది,
నన్ను వదిలినందుకు కాదు…
నన్ను కోల్పోయానని ఒకరోజు నువ్వే ఏడుస్తావు.
రచన : కె.మురళీమోహన్ రాజు, నెల్లూరు.
చరవాణి : 9866179385





