హంసధ్వని" సంగీత పరిశోధనా అంశాల శిక్షణా శిబిరం ఆగస్టు 29 నాడు.
సుప్రసిద్ధ సాంస్కృతిక సంస్థ నవ్యనాటక సమితి ఆధ్వర్యంలో
"హంసధ్వని" సంగీత పరిశోధన అంశాల రూపకల్పన లో శిక్షణా శిబిరం ఈనెల 29వ తేదీనాడు నిర్వహింపబడుతుందని సమితి అధ్యక్షుడు వేమరాజు విజయకుమార్, సమన్వయకర్తలు నిష్టల సుధామాల, డాక్టర్ ఇందిరా హేమలు తెలియజేసారు.
ఈ కార్యక్రమానికి చెందిన పోస్టర్ ను
సోమవారం నాడు సమితి కార్యాలయంలో ప్రముఖ సంగీత విద్వాంసురాలు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సంగీత విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్
డా. పావని దుడ్డు, సమితి సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ శిబిరంలో సంగీత పరిశోధనా రంగంలో కొత్తగా అడుగుపెట్టిన విద్యార్థులు, అధ్యాపకులు, మరియు ఆసక్తిగల పరిశోధకులకు విశ్లేషణాత్మక ఆలోచన, సరైన శోధనా అంశాల ఎంపిక, పరిశోధనా విధానాలు, మరియు సమాచార సేకరణ విధానాలు వంటి అంశాలపై ప్రాముఖ్యతనిచ్చి వివరంగా అవగాహన కల్పించబడుతుందని
నిష్ఠల సుధామాల తెలిపారు.
ఈ వర్క్‌షాప్‌ను డా. పావని దుడ్డు గారు ఇంటరాక్టివ్ సెషన్‌గా నిర్వహిస్తారు. ఈ సెషన్‌లో పాల్గొనేవారు పరిశోధనా విషయ అభివృద్ధి ప్రక్రియను సవివరంగా అర్థం చేసుకోవడమే కాకుండా, ఆలోచనలు, సూత్రీకరణ, పరిశోధనా ప్రశ్నలు, లక్ష్యాలు, మరియు సాహితీ సమీక్షపై అవగాహన పొందడం, మరియు పరిశోధనా విషయం తుది రూపుదిద్దుకునే విధానాలను నేర్చుకోవచ్చు. శాస్త్రీయ పరిశోధనలో ప్రామాణికత, ప్రాముఖ్యత, మరియు వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడానికి ఇది మంచి అవకాశం.
ఈ ఇంటరాక్టివ్ వర్క్‌షాప్ పరిశోధనా విషయాలను అభివృద్ధి చేయడానికి అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు రూపొందించబడిందని విజయ కుమార్ వివరించారు.
వేమరాజు రమాదేవి, శృతి వారణాసి, యశస్విని పొన్నలు పాల్గొన్నారు.





