నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్
హాలియా: హాకీ దిగ్గజం, భారత హాకీ పితామహుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని హాలియా మున్సిపాలిటీ పరిధిలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో ప్రత్యేక ర్యాలీ చేపట్టారు.
హాలియా బస్టాండ్ నుంచి ప్రధాన కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ ర్యాలీని శ్రీ శ్లోక గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ డాక్టర్ కుకుడాల ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరమని, క్రీడల ద్వారా క్రమశిక్షణ, పట్టుదల, ఐక్యత వంటి లక్షణాలు పెంపొందుతాయని అన్నారు.
కార్యక్రమంలో సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటరామిరెడ్డి, సిహెచ్ డొమినిక్, రాంబాబు, మండల అధ్యక్షులు బుయ్య పరమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు చంద్రశేఖర్, మంగ్య నాయక్, అనిల్, కిరణ్ కుమార్, పర్వతాలు, పరమేష్, నయూం, సీనియర్ క్రీడాకారులు ఎండి అన్వర్ ఖాన్, కోటేష్, పిల్లి నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.






