హైదరాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 26:
గాన కళాప్రపూర్ణ, స్వరసమ్రాట్ డా. టి. శరత్ చంద్ర స్వర సారధ్యంలో గాన గాంధర్వ ఘంటసాల "స్వర వైభవానికి.. సుస్వర కృతజ్ఞత" పేరిట సినీ సంగీత విభావరి శ్రీ త్యాగరాయ గానసభ లోని కళా వెంకట దీక్షితులు కళా వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా ఐజిజిఏ చైర్మన్ యూఎస్ఏ దాము గెడాల పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శరత్ చంద్ర నిర్వహ ప్రముఖ గాయనీ, గాయకులు
ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.








