హైదరాబాద్,ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్ ఆగస్టు 25: నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి క్రిస్ హోలీ స్పిరిట్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా మంగళవారం తెలంగాణ గంగపుత్ర ఆత్మగౌరవ భవనం ట్రస్ట్ ఆధ్వర్యంలో సిద్ధంశెట్టి టవర్స్ అపార్ట్‌మెంట్‌లో రామచందర్, ఆర్కే ప్రసాద్ అధ్యక్షతన ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు ఘన అభినందన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహా, కలిసేటి భీమ్‌రాజ్, నిమ్స్ సెక్యూరిటీ రిటైర్డ్ అధికారి బంగారి ఉమేష్, ముఠా నరేష్, విద్యాసాగర్, సాయి, హనుమంతు, పూసరాజు, నాగుల ప్రకాష్, డి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.





