ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

మంగళవారం1 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:30 pm

మంగళవారం

1 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:30 pm

SENSEX76,944-0.68%
NIFTY24,056-0.63%
హైదరాబాద్ 22K₹1,42,935/10g-4.88%
హైదరాబాద్ 24K₹1,55,929/10g-4.88%
వెండి₹2,14,179/kg-6.42%

తాజా వార్తలు

సికింద్రాబాద్ న్యూ క్లబ్ నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ అభినందనలు

The newly elected office-bearers of Secunderabad New Club met Cantonment MLA Sri Ganesh, who congratulated them and assured full support for their future endeavors.

nagendra1 September 2026, 2:07 PM1 చూసులుtrinetnews.com
సికింద్రాబాద్ న్యూ క్లబ్ నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ అభినందనలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

నూతన అధ్యక్షుడు నోముల ప్రకాశ్ రావుకు సన్మానం

సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 1:

సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని న్యూ క్లబ్‌కు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, కమిటీ సభ్యులు మంగళవారం పికెట్‌లోని క్యాంపు కార్యాలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నోముల ప్రకాశ్ రావుతో పాటు కమిటీ సభ్యులను ఎమ్మెల్యే శ్రీగణేష్ అభినందించారు. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, న్యూ క్లబ్ అభివృద్ధితో పాటు సభ్యుల సంక్షేమానికి కమిటీ సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే సామాజిక, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా, పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. న్యూ క్లబ్ అభివృద్ధికి భవిష్యత్తులో తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే శ్రీగణేష్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో న్యూ క్లబ్ కమిటీ సభ్యులు కిరణ్ కుమార్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి