ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

మంగళవారం1 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:30 pm

మంగళవారం

1 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:30 pm

SENSEX76,957-0.90%
NIFTY24,080-1.04%
హైదరాబాద్ 22K₹1,46,870/10g-2.23%
హైదరాబాద్ 24K₹1,60,222/10g-2.23%
వెండి₹2,21,959/kg-1.19%

తాజా వార్తలు

అనారోగ్య బాధితులకు ఎల్‌ఓసీ నిధులు అందించిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

Secunderabad MLA T. Padma Rao Goud handed over Letter of Credit (LOC) financial aid for medical treatments to two ailing individuals in Seethaphalmandi.

nagendra31 August 2026, 7:54 PM0 చూసులుtrinetnews.com
అనారోగ్య బాధితులకు ఎల్‌ఓసీ నిధులు అందించిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

సికింద్రాబాద్, ట్రైనేట్ న్యూస్, ఆగస్టు 31

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన ఎర్రా రుషి, కంద స్వామిలకు వైద్య చికిత్స కోసం స్థానిక ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ ఆర్థిక సహాయం అందించారు.

కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారు సీతాఫలమండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పద్మారావు గౌడ్‌ను కలిసి తమకు వైద్య సహాయం అందించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించి కంద స్వామికి రూ.2.10 లక్షలు, ఎర్రా రుషికి రూ.2 లక్షలు వైద్య చికిత్స కోసం మంజూరు చేయించారు.

సోమవారం సీతాఫలమండీలోని తన కార్యాలయంలో బాధితులకు ఎల్‌ఓసీ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు ఏ అవసరం వచ్చినా తన కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య సేవలు అందేలా అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు డాక్టర్ సామల హేమ, కంది శైలజ, రాసూరి సునీత, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి