ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం2 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:29 pm

బుధవారం

2 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:29 pm

SENSEX76,944-0.68%
NIFTY24,056-0.63%
హైదరాబాద్ 22K₹1,41,693/10g-5.70%
హైదరాబాద్ 24K₹1,54,574/10g-5.70%
వెండి₹2,12,218/kg-7.28%

తాజా వార్తలు

వెలుగుగుట్టపై రామాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చొరవ..

Uppal MLA Bandari Laxma Reddy intervened to resolve the dispute over the Sri Rama temple construction on Velugu Gutta, urging officials to cooperate.

nagendra2 September 2026, 1:02 AM2 చూసులుtrinetnews.com
వెలుగుగుట్టపై రామాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చొరవ..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

* ఐలా అధికారులతో చర్చించి ఆలయ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి..

* ప్రజల మనోభావాలను గౌరవిస్తూ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని సూచన..

నాచారం, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 1:

హబ్సిగూడ వెలుగుగుట్ట ప్రాంతంలో రామాలయ నిర్మాణానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చొరవ తీసుకున్నారు. రామాలయ నిర్మాణానికి సంబంధించిన గేటు, ఇతర నిర్మాణాలను ఐలా అధికారులు తొలగించడంతో స్థానికంగా నెలకొన్న పరిస్థితిపై ఎమ్మెల్యే స్పందించారు. స్వయంగా వెలుగుగుట్ట ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఐలా అధికారులను కలిసి రామాలయ నిర్మాణాన్ని కొనసాగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఆలయ నిర్మాణం స్థానిక ప్రజల విశ్వాసం, ఆధ్యాత్మిక భావోద్వేగాలతో ముడిపడి ఉన్నందున వారి మనోభావాలను గౌరవిస్తూ సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి ఐలా అధికారులు సానుకూలంగా స్పందించి, రామాలయ నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రజల విశ్వాసాలు, ఆధ్యాత్మిక భావాలకు గౌరవం కల్పిస్తూ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు..

తెలంగాణలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు..

నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండించి, పరామర్శించేందుకు వెళ్తున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారం రోజుల్లో తనను రెండోసారి గృహనిర్బంధం చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ఆయన విమర్శించారు.

మిగతా చదవండి →