* ఐలా అధికారులతో చర్చించి ఆలయ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి..
* ప్రజల మనోభావాలను గౌరవిస్తూ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని సూచన..
నాచారం, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 1:
హబ్సిగూడ వెలుగుగుట్ట ప్రాంతంలో రామాలయ నిర్మాణానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చొరవ తీసుకున్నారు. రామాలయ నిర్మాణానికి సంబంధించిన గేటు, ఇతర నిర్మాణాలను ఐలా అధికారులు తొలగించడంతో స్థానికంగా నెలకొన్న పరిస్థితిపై ఎమ్మెల్యే స్పందించారు. స్వయంగా వెలుగుగుట్ట ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఐలా అధికారులను కలిసి రామాలయ నిర్మాణాన్ని కొనసాగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఆలయ నిర్మాణం స్థానిక ప్రజల విశ్వాసం, ఆధ్యాత్మిక భావోద్వేగాలతో ముడిపడి ఉన్నందున వారి మనోభావాలను గౌరవిస్తూ సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి ఐలా అధికారులు సానుకూలంగా స్పందించి, రామాలయ నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రజల విశ్వాసాలు, ఆధ్యాత్మిక భావాలకు గౌరవం కల్పిస్తూ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






