Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,37,683/10g-0.32%
भाषाएँ

Latest News

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం అప్లికేషన్ ప్రక్రియ ,పథకం అమలుపై చర్చ బీసీ గురుకులాలు, హాస్టల్ ల పనితీరుపై చర్చ

Transport and BC Welfare Minister Ponnam Prabhakar held a high-level review meeting on the application process for the 'Intinta Indiramma Sewing Machines' scheme and the functioning of BC residential schools and hostels.

nagendra21 September 2026, 2:53 PM3 व्यूtrinetnews.com
బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం అప్లికేషన్ ప్రక్రియ ,పథకం అమలుపై చర్చ బీసీ గురుకులాలు, హాస్టల్ ల పనితీరుపై చర్చ

Share this story

Share link keeps your language (?lang=)

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం అప్లికేషన్ ప్రక్రియ ,పథకం అమలుపై చర్చ

బీసీ గురుకులాలు, హాస్టల్ ల పనితీరుపై చర్చ

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 21: బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, విద్యా కార్యక్రమాలపై మినిస్టర్ క్వార్టర్స్ లో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీ మహిళలకు అందిస్తున్న ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం అప్లికేషన్ ప్రక్రియ,పథకం అమలు, బీసీ గురుకులాలు, హాస్టళ్ల పనితీరు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలపై మంత్రి విస్తృతంగా చర్చించారు.

‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం కింద ఇప్పటివరకు 4 లక్షల 6 వేల దరఖాస్తులు అందినట్లు అధికారులు మంత్రికి వివరించారు. కుట్టు మిషన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 30వ తేదీతో ముగియనున్నందున, అర్హులైన బీసీ మహిళలకు పథకం ప్రయోజనం అందేలా ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

గురుకులాలు, హాస్టళ్లలో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం*

మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు, బీసీ హాస్టళ్ల పనితీరుపై మంత్రి ఆరా తీశారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు.

విద్యార్థులకు పాఠ్యప్రణాళికతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం మరింత మెరుగైన ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని మంత్రి సూచించారు. గురుకులాలు, హాస్టళ్లలో విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక వసతుల కల్పన, క్రీడలకు ప్రాధాన్యం, సిబ్బంది నియామకాలు, డిజిటల్ విద్య, ఉన్నత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, కుల సంఘాలతో సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

బీసీల ఆర్థికాభివృద్ధికి చర్యలు*

బీసీల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా నైపుణ్యాభివృద్ధితో పాటు పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థులు చదువుతో పాటు తమ ప్రతిభను వివిధ రంగాల్లో అభివృద్ధి చేసుకునేలా అవసరమైన అవకాశాలను కల్పించాలని అధికారులకు సూచించారు.

గురుకులాలకు సొంత భవనాల నిర్మాణంపై దృష్టి*

రాష్ట్రంలో మొత్తం 327 బీసీ గురుకుల పాఠశాలలు ఉండగా, ప్రస్తుతం కేవలం 21 పాఠశాలలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో, వివిధ జిల్లాల్లో గురుకుల పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని స్థల సేకరణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే స్థలం అందుబాటులో ఉన్న గురుకుల పాఠశాలలకు భవనాల నిర్మాణం చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్కతో చర్చించి అవసరమైన నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అలాగే బీసీ గురుకులాలు, హాస్టళ్ల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. బీసీ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాల మాయాదేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు మల్లయ్య బట్టు, అలోక్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें