E-Paperఈ-పేపర్PDF · Clip · Archive
భాషలు

ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

గురువారం24 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:05 amసూర్యాస్తమయం 6:10 pm

గురువారం

24 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:05 am

సూర్యాస్తమయం 6:10 pm

SENSEX74,163-0.18%
NIFTY23,231-0.49%
హైదరాబాద్ 22K₹1,42,401/10g-1.33%
హైదరాబాద్ 24K₹1,55,346/10g-1.33%
వెండి₹2,15,201/kg-1.80%

తాజా వార్తలు

మొరాయిస్తున్న మీ సేవ సర్వర్

MeSeva servers in Hyderabad are facing technical glitches, leaving citizens and students waiting for hours as the scholarship application deadline approaches.

nagendra24 September 2026, 3:44 AM0 చూసులుtrinetnews.com
మొరాయిస్తున్న మీ సేవ సర్వర్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 23:

నగరం లోని మీ సేవ కేంద్రాల్లో సర్వర్‌ మొరాయిస్తోంది. ఉదయం నుంచి రాత్రివరకు ఇదే పరిస్థితి ఉంటుండడంతో వివిధ పనులపై వెళ్లిన పౌరులు, విద్యార్థులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు.

సర్వర్‌ ఎప్పుడు పనిచేస్తుందో తెలియక గంటల తరబడి కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరం ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరిన విద్యార్థులు ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవ కేంద్రాలకు ఇటీవల తరలివెళ్తున్నారు.కాగా, దరఖాస్తుకు చివరితేదీ ఈ నెల 25 వరకు మాత్రమే ఉండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పట్టుకుని సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. స్కాలర్‌షి్‌పనకు దరఖాస్తు చేయాలంటే ముందుగా మీ సేవ కేంద్రాల్లో బయోమెట్రిక్‌ పూర్తి చేసుకోవాలి. తర్వాత ఆన్‌లైన్‌ సెంటర్స్‌లో దరఖాస్తును అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. వారం రోజుల నుంచి మీ-సేవ కేంద్రాల్లో బయోమెట్రిక్‌ సర్వర్‌ అందుబాటులోకి రాకపోవడంతో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.ఉదయం నుంచి రాత్రి వరకు వేచిచూస్తున్నా.. సర్వర్‌ రాకపోవడంతో నిరుత్సాహంతో ఇంటికి వెళ్తున్నారు. దీనిపై మీ సేవ సిబ్బందిని అడిగితే తమకు ఏమీ తెలియదని, పైనుంచి వస్తేనే తాము చేస్తామని సమాధానం చెబుతున్నారని పలువురు విద్యార్థులు వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి