ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం16 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:17 pm

బుధవారం

16 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:17 pm

SENSEX74,136-1.02%
NIFTY23,172-1.30%
హైదరాబాద్ 22K₹1,43,822/10g-0.94%
హైదరాబాద్ 24K₹1,56,897/10g-0.94%
వెండి₹2,16,956/kg+0.92%

తాజా వార్తలు

క్రేజీ ప్రాజెక్ట్ 'లీసా' (LEESA)లోకి ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మ ఎంట్రీ!

Renowned music director Mani Sharma has officially come on board for the unique multi-genre film 'LEESA', starring Ananya Nagalla.

nagendra16 September 2026, 2:05 AM0 చూసులుtrinetnews.com
క్రేజీ ప్రాజెక్ట్ 'లీసా' (LEESA)లోకి ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మ ఎంట్రీ!

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ విట్నెస్ చేయని విధంగా, సరికొత్త రెండు విభిన్న జోనర్ల కలయికతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న వినూత్న చిత్రం 'లీసా'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు మరో భారీ బలం తోడైంది.

టాలెంటెడ్ నటి అనన్య నాగళ్ళ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్ర స్క్రిప్ట్, కాన్సెప్ట్ విన్న వెంటనే ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మ గారు పూర్తి ఇంప్రెస్ అయ్యారు. కథలోని సరికొత్త వినూత్నతను మెచ్చి, స్వయంగా పాటలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకుంటూ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మణిశర్మ గారి అద్భుతమైన స్వరాలు, నేపథ్య సంగీతం 'లీసా' చిత్రాన్ని మరో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ వినూత్న చిత్రానికి జవహర్ పవార్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ సక్సెస్ఫుల్ సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ అందిస్తూనే కో-ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

ఓం సాయిరామ్ ఆర్ట్స్ బ్యానర్‌పై వెంకట్ దుగ్గిరెడ్డి మరియు ఐరాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఐల రామకృష్ణ ఇద్దరూ కలిసి అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి

ఇవి కూడా చదవండి