ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

మంగళవారం1 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:30 pm

మంగళవారం

1 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:30 pm

SENSEX76,957-0.90%
NIFTY24,080-1.04%
హైదరాబాద్ 22K₹1,46,955/10g-2.17%
హైదరాబాద్ 24K₹1,60,315/10g-2.17%
వెండి₹2,22,157/kg-1.10%

తాజా వార్తలు

“సేవారత్న” అవార్డు అందుకున్న మారమోని శ్రీశైలం యాదవ్‌

Maramoni Srisailam Yadav received the 'Sevaratna' Award in recognition of his extensive social service and humanitarian activities.

nagendra31 August 2026, 7:37 PM0 చూసులుtrinetnews.com
“సేవారత్న” అవార్డు అందుకున్న మారమోని శ్రీశైలం యాదవ్‌

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, ఆగస్ట్ 31 :

సమాజంలో మానవతా విలువలను పెంపొందిస్తూ.. ప్రజలకు అండగా నిలుస్తున్న మారమోని శ్రీశైలం యాదవ్ సేవా కార్యక్రమాలకు మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. ఇటీవల

“స్వర సప్త సంగీత వాద్య నృత్య సమ్మేళనం” కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ “సేవారత్న అవార్డు”తో ఘనంగా సత్కరించారు. గత కొంతకాలంగా శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రక్తదాన శిబిరాలు , అన్న ప్రసాద వితరణ, విద్యార్థులకు విద్యా ఫీజుల సహాయం, వైద్య చికిత్సకు ఆర్థిక సహకారం, ఆసుపత్రుల్లో అవసరమైన వారికి మెడికల్ సహాయం, అనాథా, వృద్ధాశ్రమాల్లో ఆహార పంపిణీ, నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. అవసరమైన సమయంలో బాధిత కుటుంబాలకు తనవంతు సహాయాన్ని అందిస్తూ సేవా స్ఫూర్తిని చాటుతున్నారు.

ఈ సందర్భంగా శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ.. “సేవ చేయడం ద్వారా లభించే ఆత్మసంతృప్తి ఎంతో విలువైనదన్నారు . సమాజంలో అవసరంలో ఉన్న ఒక్క వ్యక్తికి అయినా సహాయం చేయగలిగితే అదే నాకు నిజమైన ఆనందం. ఈ అవార్డు నా సేవా బాధ్యతను మరింత పెంచిందని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. శ్రీశైలం యాదవ్ సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలు, మిత్రులు, సేవా కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి