ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

ఆదివారం30 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:31 pm

ఆదివారం

30 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:31 pm

SENSEX77,265-0.14%
NIFTY24,176-0.18%
హైదరాబాద్ 22K₹1,48,345/10g-2.33%
హైదరాబాద్ 24K₹1,61,831/10g-2.33%
వెండి₹2,24,498/kg-1.24%

తాజా వార్తలు

మణికుమార్ క్రికెట్ క్లబ్‌కు 5 వికెట్ల విజయం

Relying on a strong team effort, Manikumar Cricket Club defeated New Stars Cricket Club by 5 wickets in the HCA 'C' Division One-Day League.

nagendra30 August 2026, 1:58 AM2 చూసులుtrinetnews.com
మణికుమార్ క్రికెట్ క్లబ్‌కు 5 వికెట్ల విజయం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 29: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ‘సి’ డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా మణికుమార్ క్రికెట్ క్లబ్, న్యూ స్టార్స్ క్రికెట్ క్లబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

ప్రతీక్ రాజనేని, కనుకుంట్ల శేఖర్ బాబు, కొంగరి శ్రీ విధాత్, వేదాస్ వురాడి అద్భుతమైన సమష్టి ప్రదర్శనతో మణికుమార్ క్రికెట్ క్లబ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

టాస్ గెలిచిన న్యూ స్టార్స్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 47.5 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. మణికుమార్ క్రికెట్ క్లబ్ బౌలర్లలో ప్రతీక్ రాజనేని 8.5 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టగా, కనుకుంట్ల శేఖర్ బాబు 10 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు సాధించారు.

136 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన మణికుమార్ క్రికెట్ క్లబ్ 39.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. కొంగరి శ్రీ విధాత్ 100 బంతుల్లో 4 ఫోర్లతో 37 పరుగులు చేయగా, వేదాస్ వురాడి 54 బంతుల్లో 6 ఫోర్లతో 32 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో మణికుమార్ క్రికెట్ క్లబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు, మణికుమార్ క్రికెట్ క్లబ్ కార్యదర్శి కృష్ణ చతుర్వేదుల, క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి ప్రాతూరి లక్ష్మీ ప్రియదర్శిని జట్టు సమష్టి కృషిని అభినందించారు. మణికుమార్ క్రికెట్ క్లబ్ సంయుక్త కార్యదర్శి చతుర్వేదుల రవితేజ్ క్రీడాకారులకు ట్రోఫీలను అందజేశారు.

ఇవి కూడా చదవండి