ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి,సెప్టెంబరు09:
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం బుధవారం రోజున మండల కేంద్రంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్రీడాకారుల (కబడ్డీ,వాలీబాల్, ఖో ..ఖో...) ఎంపిక స్థానిక జి.ప.ఉ.పా. ఆత్మకూరు(ఎం) నందు నిర్వహించడం జరిగినది. ఎంపిక అయిన మండల జట్లను జిల్లాస్థాయికి పంపడం జరుగుతున్నదని మండల విద్యాధికారి పి.వెంకట రామి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండీ మక్సూద్ అలీ, పి.డి.లు ఇందిరా ప్రియ,రవీందర్,రామ అంజమ్మ,స్వప్న,అన్ని పాఠశాలల ఉపాద్యాయులు పాల్గొన్నారు.






