శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,235/10g+1.53%
భాషలు

తాజా వార్తలు

వరల్డ్ వైడ్‌గా 65 కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డ్ కలెక్షన్‌లతో దూసుకుపోతోన్న ‘మండాడి’

Starring Soori and Suhas, Mathimarane Pugalendhi's directorial 'Mandadi' has grossed over Rs 65 crore worldwide, receiving stellar responses everywhere.

nagendra16 September 2026, 2:20 AM1 చూసులుtrinetnews.com
వరల్డ్ వైడ్‌గా 65 కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డ్ కలెక్షన్‌లతో దూసుకుపోతోన్న ‘మండాడి’

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన చిత్రం ‘మండాడి’. ఈ సినిమాని ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీలో సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి సెప్టెంబర్ 10న రిలీజ్ చేశారు. మంచి విజయంతో దూసుకుపోతోన్న ఈ సినిమాకి రికార్డ్ కలెక్షన్స్ వస్తున్నాయి.

తమిళ, తెలుగు భాషల్లోనే కాకుండా రిలీజ్ చేసిన అన్ని చోట్లా ‘మండాడి’కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకి 65 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. వరల్డ్ వైడ్‌గా ‘మండాడి’ 65 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని మేకర్స్ అధికారికంగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రం మున్ముందు మరిన్ని రికార్డుల్ని బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సూరి, సుహాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా ‘మండాడి’ నిలవనుందని సమాచారం.

‘మండాడి’ సినిమాలోని బోట్ సీక్వెన్స్, రేసింగ్ సీన్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది. ‘మండాడి’ సినిమాకి కథిర్ అందించిన విజువల్స్, జీవీ ప్రకాష్ బీజీఎం, పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలెట్‌గా నిలిచాయి. సూరి, సుహాస్ నటన, వారి పాత్రలు సినిమాని నిలబెట్టాయి. ఇక ఈ చిత్రాన్ని వీక్షించి రజినీకాంత్, వెట్రిమారన్ వంటి వారు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

నటీనటులు : సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్

సమర్ఫణ : ఎల్రెడ్ కుమార్

క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వెట్రిమారన్

నిర్మాత : ఎల్రెడ్ కుమార్

సహ నిర్మాత : మణికందన్

దర్శకుడు : మతిమారన్ పుగళేంది

సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్

కెమెరామెన్ : ఎస్.ఆర్. కథిర్

ఎడిటింగ్ : ప్రదీప్ ఇ. రాఘవ్

యాక్షన్ : పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ

ప్రొడక్షన్ డిజైన్‌ : డి.ఆర్.కె. కిరణ్

పీఆర్వో : సాయి సతీష్

ఇవి కూడా చదవండి

రైల్వే డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

రైల్వే డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

రైల్వే డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. హైద్రాబాద్, ట్రైనెట్, న్యూస్, అక్టోబర్,9.పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహభరితంగా నిర్వహించారు.తార్నాక లోని రైల్వే డిగ్రీ కళాశాలలో 1985 బ్యాచ్ తెలుగు మీడియం విద్యా

మిగతా చదవండి →

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు రవీంద్రభారతిలో ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం అక్టోబరు 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ హైదరాబాద్‌, అక్టోబరు 9 (ట్రైనెట్ న్యూస్): తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘

మిగతా చదవండి →

మహిళా సాధికారతకు ప్రతీకగా సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో 46వ స్నాతకోత్సవం

మహిళా సాధికారతకు ప్రతీకగా సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో 46వ స్నాతకోత్సవం

మహిళా సాధికారతకు ప్రతీకగా సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో 46వ స్నాతకోత్సవం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 9, 2026: హైదరాబాద్‌లోని బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో 46వ స్నాతకోత్సవం ఘనంగా నిర్

మిగతా చదవండి →

యువతలో మంచి చేయాలనే ఆలోచనలు రావాలి: డాక్టర్ కేవీ రమణాచారి

యువతలో మంచి చేయాలనే ఆలోచనలు రావాలి: డాక్టర్ కేవీ రమణాచారి

యువతలో మంచి చేయాలనే ఆలోచనలు రావాలి డాక్టర్ కేవీ రమణాచారి హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 9 : నేటి యువతలో మంచి చేయాలనే ఆలోచనలు ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణ చారి అన్నారు. బ్రాహ్మణ

మిగతా చదవండి →