ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

గురువారం17 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:16 pm

గురువారం

17 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:16 pm

SENSEX74,315-0.62%
NIFTY23,271-0.54%
హైదరాబాద్ 22K₹1,43,967/10g+0.44%
హైదరాబాద్ 24K₹1,57,055/10g+0.44%
వెండి₹2,15,646/kg+1.93%

తాజా వార్తలు

మహిళల కోసం 'సూపర్ షీ ఛాలెంజ్' అనౌన్స్ చేసిన "కిల్లర్" మేకర్స్. విజేతలకు రూ. 1లక్షా, 40 వేల క్యాష్ ప్రైజ్ అక్టోబర్ 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ "కిల్లర్"

The makers of the upcoming sci-fi thriller 'Killer', slated for an October 30 global release, have announced a 'Super SHE Challenge' exclusively for women, offering cash prizes totaling Rs 1.4 lakh.

nagendra16 September 2026, 2:20 AM1 చూసులుtrinetnews.com

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. "కిల్లర్" సినిమా అక్టోబర్ 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ రాబోతోంది.

ఈ రోజు మహిళల కోసం "కిల్లర్" సినిమా మేకర్స్ సూపర్ షీ ఛాలెంజ్ ను అనౌన్స్ చేశారు. రాత్రికి రాత్రే మీకు సూపర్ పవర్ వస్తే ఏం చేస్తారో చెబుతూ రీల్స్ చేసి పంపితే వారిలో బెస్ట్ రీల్స్ చేసిన పది మందికి ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున క్యాష్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. అలాగే తమ ఆన్సర్స్ ను టెక్ట్స్ మెసేజ్ పంపిన వారిలో బెస్ట్ ఆన్సర్స్ పంపిన 20 మంది ఒక్కొక్కరు 2 వేల రూపాయల చొప్పున క్యాష్ ప్రైజ్ అందుకోవచ్చు. త్వరలో జరగనున్న కిల్లర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజేతలను వేదిక మీదకు పిలిచి ఈ క్యాష్ ప్రైజ్ అందిస్తారు. ఔత్సాహికులు తమ రీల్స్, టెక్ట్స్ మెసేజ్ లు హీరోయిన్ జ్యోతి పూర్వజ్ ఇన్ స్టాగ్రామ్ అక్కౌంట్ కు ట్యాగ్ చేసి, #SuperSHE #KilleR అనే హ్యాష్ ట్యాగ్స్ రాయాలి. ఈ వివరాలను వెల్లడిస్తూ హీరోయిన్ జ్యోతి పూర్వజ్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.

ఓవర్సీస్ లో "కిల్లర్" మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఓఎంజి పిక్చర్స్ ఈ సినిమాను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ సంస్థ "కిల్లర్" సినిమాను అమెరికా, యూరప్, కెనడా, అరబ్ దేశాలు, మలేషియా, న్యూజిలాండ్, రష్యా వంటి దేశాల్లో విడుదల చేయబోతోంది.

నటీనటులు - జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ , మనీష్ గిలాడ, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి, తదితరులు

టెక్నికల్ టీమ్

-------------------

రచన, ఎడిటింగ్, దర్శకత్వం - పూర్వాజ్

సమర్పణ - ఉర్వీశ్ పూర్వజ్

ప్రొడ్యూసర్స్ - పూర్వాజ్, పద్మనాభరెడ్డి.ఎ.

డీవోపీ - జగదీశ్ బొమ్మిశెట్టి

స్క్రీన్ ప్లే ఎడిటర్ - పూర్వాజ్

మ్యూజిక్ - ఆశీర్వాద్, సుమన్ జీవ

చీఫ్ ఎడిటర్ - బి.మనోజ్ కుమార్

మాస్టర్ చీఫ్ ఎడిటర్ - శివ శర్వాణి

కాస్టూమ్ డిజైన్ - ఉదయశ్రీ పూర్వజ్

ఆర్ట్ డైరెక్షన్ - మణి

యాక్షన్ కొరియోగ్రఫీ - రాజ్ కుమార్ గంగపుత్ర

లైన్ ప్రొడ్యూసర్స్ - దశరథ మాధవ్, సీతారామారావు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - డీఎస్ బాష

డీఐ - మయసభ స్టూడియోస్

పీఆర్ఓ - గాండ్ల శ్రీనివాస్ ( జి.ఎస్. మీడియా )

ఇవి కూడా చదవండి