హైదరాబాద్ ట్రైన్ నైట్ న్యూస్సికింద్రాబాద్, సెప్టెంబర్ 7:
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ర్యాల రాజేందర్ యాదవ్ పిలుపునిచ్చారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం రెండో దశ కార్యక్రమాన్ని మెట్టుగూడలో నిర్వహించారు. మెట్టుగూడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి, కొత్తగా ఓటు హక్కు పొందేందుకు అర్హులైన వారికి ఫారం-6 అందజేశారు. కొత్త ఓటర్లు ఫారం-6ను సద్వినియోగం చేసుకొని ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని నాయకులు సూచించారు.
ఈ సందర్భంగా ర్యాల రాజేందర్ యాదవ్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడం ప్రజాస్వామ్యంలో ఎంతో ముఖ్యమని అన్నారు. ఓటరు జాబితాలో పేర్లు లేని యువత, కొత్త ఓటర్లు ఫారం-6 ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మొహద్ సాజిద్, కాటినీడి నాగరాజు, అబ్దుల్ మన్నాన్, మహి, పృథ్వీరాజ్, మహిళా నాయకురాళ్లు రూత్ క్లారి, కస్తూరి, సంతోషి తదితరులు పాల్గొన్నారు.





