ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

గురువారం10 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:22 pm

గురువారం

10 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:22 pm

SENSEX74,774-2.28%
NIFTY23,425-1.98%
హైదరాబాద్ 22K₹1,45,437/10g+0.48%
హైదరాబాద్ 24K₹1,58,658/10g+0.48%
వెండి₹2,24,920/kg+3.06%

తాజా వార్తలు

ఈ రోజు కుత్బుల్లాపూర్ డివిజన్ ACP Sir శ్రీ బాల గంగి రెడ్డి గారు, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులతో సమావేశమై వారితో పరస్పరం మాట్లాడారు.

Kutbullapur ACP Bal Gangi Reddy interacted with the transgender community in Jeedimetla, warning against illegal extortion and highlighting government welfare and job opportunities.

nagendra10 September 2026, 1:47 AM0 చూసులుtrinetnews.com
ఈ రోజు కుత్బుల్లాపూర్ డివిజన్ ACP Sir శ్రీ బాల గంగి రెడ్డి గారు, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులతో సమావేశమై వారితో పరస్పరం మాట్లాడారు.

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 9:

ఈ రోజు కుత్బుల్లాపూర్ డివిజన్ ACP Sir శ్రీ బాల గంగి రెడ్డి గారు, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులతో సమావేశమై వారితో పరస్పరం మాట్లాడారు.

ఈ సందర్భంగా ACP Sir గారు, గృహప్రవేశ కార్యక్రమాలు, షాపుల ప్రారంభోత్సవాలు, పండుగలు, ఇతర మతపరమైన కార్యక్రమాల సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ డబ్బులు డిమాండ్ చేయడం వంటి ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని వారికి సూచించారు. ఎవరైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినట్లయితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

అదేవిధంగా, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీస్ మరియు ఇతర ప్రభుత్వ విభాగాల్లో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ఇటీవల లభిస్తున్న ఉద్యోగ అవకాశాల గురించి కూడా వివరించారు.

సమాజానికి ఉపయోగపడే గౌరవప్రదమైన వృత్తులను ఎంచుకొని స్వయం సమృద్ధి సాధించాలని ACP Sir గారు వారికి సూచించారు. భిక్షాటన మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారికి అవగాహన కల్పించారు.

ఈ సమావేశంలో జీడిమెట్ల PS SHO శ్రీ కె. రవి కుమార్ గారు, సెక్టార్ SIs శ్రీ ప్రేమ్ సాగర్, శ్రీనివాస్, శ్యామ్ బాబు, రామచంద్రయ్య మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల మృతి చెందిన నూనెముంతల బుచ్చిరాములు గౌడ్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

ఇటీవల మృతి చెందిన నూనెముంతల బుచ్చిరాములు గౌడ్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం ఖప్రాయపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ నూనెముంతల బుచ్చి రాములు గౌడ్ మృతి చెందగా, వారి కుటుంబాన్ని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బుచ్చి రాములు గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మిగతా చదవండి →

అపెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యేమ్మే కల్యాణ్ ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

అపెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యేమ్మే కల్యాణ్ ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

Former Government Whip Gongidi Sunitha Mahender Reddy visited Yemme Kalyan, who is receiving treatment at Apex Hospital in Boduppal following an accident.

మిగతా చదవండి →