హైదరాబాద్, రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 29: ప్రముఖ నాట్య, సంగీత విద్వాంసురాలు, వర్ణ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ స్మితా మాధవ్ శిష్యురాలు కుమారి అక్షిత భరతనాట్య అరంగేట్ర ప్రదర్శన 'వర్ణ ఆర్ట్స్ అకాడమీ' ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా క్లాసికల్ ఓకలిస్ట్ హరిణి రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అరుణ బాల సుబ్రమణియన్ కుమార్తె అయిన అక్షిత శర్మ భరతనాట్యంలో విశేష సాధన చేసి భరతనాట్య అరంగేట్రం చేయడం అభినందనీయమన్నారు. గురు డాక్టర్ స్మితా మాధవ్ భారతీయ సంస్కృతి కలలను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు వర్ణ ఆర్ట్స్ అకాడమీ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు నాట్య శిక్షణ అందిస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు ప్రదర్శించాలని ఆకాంక్షించారు . అకాడమీ భరతనాట్య విభాగాధిపతి భార్గవి పరమేశ్వరన్ సహాయ సహకారాలు అందించారు.
కుమారి అక్షిత శర్మ ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ లో 9వ తరగతి చదువుతుంది. చిన్న వయసులోనే భరతనాట్యం అనే కలపై మక్కువతో ప్రాథమిక శిక్షను ఉమా రాధ వద్ద ప్రారంభించి నాలుగు సంవత్సరాల క్రితం వర్ణ ఆర్ట్స్ అకాడమీలో చేరి
గురువులు స్మిత మాధవ్, భార్గవి పరమేశ్వరన్ శిక్షణలో అంకితభావంతో,క్రమశిక్షణ శిష్యురాలు రాణించి గురువులతో కలిసి ప్రదర్శనలు ఇచ్చే అవకాశాలు లభించడంతో కుమారి అక్షిత పశుపతి ఆలయం, కాశి, అయోధ్య, తిరుచానూర్, వంటి ప్రతిష్టాత్మక నృత్య ప్రదర్శనలో పాల్గొని అందరి ప్రశంసలను పొందారు . నృత్యంతో పాటు కర్ణాటక సంగీతం, శాస్త్రీయ సంగీతం, చిత్రలేఖనం రంగాలలో కూడా బహుమతులు గెల్చుకుంది. కుమారి అక్షిత మాట్లాడుతూ దైవ కృపతో పెద్దల ప్రోత్సాహంతో గురువుల అమూల్యమైన మార్గదర్శకత్వంతో భరతనాట్య అరంగేట్రం చేయడం నా జీవితంలో మైలురాయిగా నిలిచిపోయిందని, స్నేహితులు బంధువుల మధ్య అరంగేట్రం చేయడం వారందరి ఆశీర్వాదాలు పొందడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.









