..కృష్ణస్వామి ఉత్సవ కమిటీ సభ్యులు.
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ ,సెప్టెంబర్,3, ఈ నెల నాలుగవ తేదీన కొరివి కృష్ణస్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ముదిరాజ్ మహాసభ ప్రతినిధులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. BANSILALPET డివిజన్ పరిధి బోయగుడలోని ముదిరాజ్ మహాసభ భవన్ లో కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపకులు,సంఘసంస్కర్త, మాజీ మేయర్ దివంగత కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 133 వ జయంతి వేడుకలను బోయగుడాలోని ముదిరాజ్ భవన్లో ఈ నెల 4 వ తేదీ శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి,మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ,రాష్ట్ర బి సి సంక్షేమ,అభివృద్ధి సంస్థ సలహాదారు వి.హనుమంతరావు,ముదిరాజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ లు హాజరుకానున్నట్లు తెలిపారు.ఉత్సవ కమిటీ సభ్యులు అధ్యక్షులు జి.దివాకర్ ముదిరాజ్,ఉపాధ్యక్షుడు మన్మోహన్ ముదిరాజ్,ప్రధానకార్యదర్శి కృష్ణమూర్తి ముదిరాజ్,గొడుగు ఆంజనేయులు,సురేందర్,వెంకట్రావు,మంద శ్రీనివాస్,నీలం శ్రీనివాస్,నరేష్ కుమార్,రాజేంద్ర ప్రసాద్,లక్ష్మణరావు, శ్రీనివాస్.





