మహాగణపతిని దర్శించుకున్న శివ నరసింహన్ తంత్రి
ఖైరతాబాద్, ట్రైనెట్ న్యూస్ 21:
ఖైరతాబాద్ మహాగణపతిని
ఎస్ఎస్ఎస్ డివోషనల్ గ్రూప్ చైర్మన్, ప్రముఖ కేరళ జ్యోతిష్య నిపుణులు శివ నరసింహన్ తంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పండితులు ఆయనకు శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహా వినాయకుని దర్శించుకోవడం మహాభాగ్యమన్నారు. మహాగణపతి ఆశీస్సులు ప్రతి ఒకరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు.






