ఆదివారం11 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

గ్లోబల్ కన్వెన్షన్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న కట్టా సురేష్

Katta Suresh was honored with the NRI Vasavi Association Lifetime Achievement Award for his pioneering contributions to big data and clinical analytics.

nagendra21 August 2026, 8:37 PM8 చూసులుtrinetnews.com
గ్లోబల్ కన్వెన్షన్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న కట్టా సురేష్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 21 : దశాబ్దాలుగా బిగ్ డేటా క్లినికల్ అనలిటిక్స్ రంగాలలో అందించిన విశేష సేవలు, సాంకేతిక ఆవిష్కరణలకు గుర్తింపుగా కట్టా సురేష్ కి ప్రతిష్టాత్మకమైన

ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్

(ఎన్ఆర్ఐవీఏ) 8వ గ్లోబల్ కన్వెన్షన్ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ మాజీ చైర్మన్ సుంకు జయసింహ, ఏపీ మంత్రి టీజీ భరత్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

సాధారణ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన సురేష్ ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి అక్కడ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి బిగ్ డేటా అనే భావన ప్రాచుర్యంలో లేని 1997లోనే దూరదృష్టితో సామా టెక్నాలజీస్ ను స్థాపించారని పేర్కొన్నారు . భవిష్యత్తులో భారీ స్థాయి డేటా ప్రాధాన్యతను ముందుగానే గుర్తించిన ఆయన. డేటాను విశ్లేషించి ఉపయోగకరమైన సమాచారంగా మార్చే దిశగా సంస్థను అభివృద్ధి చేశారు. కట్టా సురేష్ నాయకత్వంలో సామా టెక్నాలజీస్ అభివృద్ధి చేసిన బిగ్ డేటా ఆధారిత క్లినికల్ అనలిటిక్స్ సాంకేతికతలు కోవిడ్- 19 మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ అభివృద్ధి. క్లినికల్ ట్రయల్ డేటా విశ్లేషణ సంబంధించిన భారీ డేటాను విశ్లేషించడంలో, నిర్ణయ ప్రక్రియలను వేగవంతం చేయడంలో కీలకంగా ఉపయోగపడ్డాయి. అతి తక్కువ సమయంలోనే వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంలో ఈ పరిశోధనలు ఒక కీలక మైలురాయిగా నిలిచాయి. ఈ విధంగా సామా టెక్నాలజీస్ "ఏఐ”ఆధారిత క్లినికల్ అనలిటిక్స్' లో ప్రముఖ సంస్థగా ప్రపంచ వైద్యరంగ చరిత్రలో తన స్థానాన్ని ఏర్పరచుకున్నారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

నవ్వించి, ఆలోచింపజేసిన 'నైవేద్యం' నాటిక ప్రదర్శన

నవ్వించి, ఆలోచింపజేసిన 'నైవేద్యం' నాటిక ప్రదర్శన

నవ్వించిన నైవేద్యం అనంతపురం, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 10: సినీ రచయిత యం.వి.ఎస్. హరనాథ రావు, వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ.. జయా ఆర్ట్స్ హైదరాబాద్, లలిత కళా పరిషత్ అనంతపురం సంయుక్త నిర్వహణలో నైవేద్యం నాటికను

మిగతా చదవండి →

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →