Friday9 October 2026హైదరాబాద్

SENSEX71,593-0.44%
NIFTY22,232-0.85%
HYD 22K₹1,38,401/10g+0.20%
भाषाएँ

Latest News

'Kabhi Kabhie Mere Dil Mein' Musical Concert on Mukesh's 50th Death Anniversary

Ramkri Melodies pays a grand musical tribute to legendary singer Mukesh on his 50th death anniversary with a special concert in Hyderabad.

nagendra9 September 2026, 2:07 AM4 व्यूtrinetnews.com
'Kabhi Kabhie Mere Dil Mein' Musical Concert on Mukesh's 50th Death Anniversary

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 8

: హిందీ సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో చిరస్థాయిగా నిలిచిన ప్రముఖ గాయకుడు ముకేష్ 50వ వర్ధంతిని పురస్కరించుకుని రామ్‌కి మెలోడీస్ ఆధ్వర్యంలో ‘కభీ కభీ మేరే దిల్ మే’ పేరుతో ప్రత్యేక సంగీత విభావరి నిర్వహిస్తున్నారు.

ముకేష్ ఆలపించిన ఎన్నో సూపర్‌హిట్, మధుర గీతాలను గాయనీ గాయకులు ఆలపించి ఆయనకు సంగీత నివాళి అర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీకే రావు, గంటి రామకృష్ణ, పీఎస్‌పీ కశ్యప్, వెంకటేశ్వరరావు, వై. నందకిశోర్, రేణుక రమేష్, గంటి శైలజ, స్వర కళ్యాణి, ఆర్తి చీడి, అనిత తదితరులు తమ గానంతో సంగీతాభిమానులను అలరించనున్నారు.

హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ, కళా లలిత కళావేదికలో మంగళవారం సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.

ముకేష్ గాన ప్రస్థానాన్ని, ఆయన అందించిన చిరస్మరణీయ గీతాలను మరోసారి గుర్తుచేసేలా ఈ సంగీత కార్యక్రమాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. సంగీతాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →