హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 8
: హిందీ సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో చిరస్థాయిగా నిలిచిన ప్రముఖ గాయకుడు ముకేష్ 50వ వర్ధంతిని పురస్కరించుకుని రామ్‌కి మెలోడీస్ ఆధ్వర్యంలో ‘కభీ కభీ మేరే దిల్ మే’ పేరుతో ప్రత్యేక సంగీత విభావరి నిర్వహిస్తున్నారు.
ముకేష్ ఆలపించిన ఎన్నో సూపర్‌హిట్, మధుర గీతాలను గాయనీ గాయకులు ఆలపించి ఆయనకు సంగీత నివాళి అర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీకే రావు, గంటి రామకృష్ణ, పీఎస్‌పీ కశ్యప్, వెంకటేశ్వరరావు, వై. నందకిశోర్, రేణుక రమేష్, గంటి శైలజ, స్వర కళ్యాణి, ఆర్తి చీడి, అనిత తదితరులు తమ గానంతో సంగీతాభిమానులను అలరించనున్నారు.
హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ, కళా లలిత కళావేదికలో మంగళవారం సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
ముకేష్ గాన ప్రస్థానాన్ని, ఆయన అందించిన చిరస్మరణీయ గీతాలను మరోసారి గుర్తుచేసేలా ఈ సంగీత కార్యక్రమాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. సంగీతాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.






